Taraka Ratna Death: అప్పటిదాకా ఉత్సాహంగా.. ఉన్నట్టుండి కుప్పకూలిన వీడియో..

Actor Taraka Ratna Last Video Goes Viral - Sakshi

నటుడు నందమూరి తారకరత్న మరణంతో సినీ ఇండస్ట్రీతో పాటు ఆయన అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. గత నెల 27న లోకేశ్‌ పాదయాత్ర ప్రారంభమైన రోజు తారకరత్న గుండెపోటుకు గురయ్యారు. ఆ సమయంలో మెదడుకు రక్త ప్రసరణ ఆగిపోవడంతో మెదడులో ఒకవైపు వాపు వచ్చింది. బెంగళూరులో మెరుగైన వైద్యం అందించినప్పటికీ ఆయన ఆరోగ్య పరిస్థితిలో ఎటువంటి పురోగతి కనిపించలేదు. మధ్య మధ్యలో ఆయన కోలుకుంటున్నారనే వార్తలు వచ్చినా రెండు రోజులుగా పరిస్థితి మరింత క్షీణించింది.

తారకరత్నను బతికించుకునేందుకు చేసిన అన్నిరకాల ప్రయత్నాలు విఫలమవడంతో శనివారం నటుడు కన్నుమూశారు. ఈ క్రమంలో తారకరత్న చివరి క్షణాలు ఇవేనంటూ ఆయన కుప్పకూలిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో తారకత్న తెల్లటి షర్ట్‌లో నుదుటన బొట్టుతో పాదయాత్రలో పాల్గొన్నారు. ఆయన వెంట బాలయ్య కూడా ఉన్నారు. నవ్వుతూ, సరదాగా మాట్లాడుతూనే పాదయాత్రలో పాల్గొన్న ఆయన ఉన్నట్టుండి కుప్పకూలిపోయారు. వెంటనే ఆయన్ను స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లడం వీడియోలో కనిపిస్తోంది.

చదవండి: నందమూరి తారకరత్న ఇక లేరు

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top