Actor Subhalekha Sudhakar’s Mother SS Kantham Passed Away- Sakshi
Sakshi News home page

Subhalekha Sudhakar: ‘శుభలేఖ’ సుధాకర్‌కు మాతృవియోగం

Sep 8 2021 7:45 AM | Updated on Sep 8 2021 12:43 PM

Actor Subhalekha Sudhakar Mother Passed Away - Sakshi

Subhalekha Sudhakar Mother Passed Away: ప్రముఖ నటుడు ‘శుభలేఖ’ సుధాకర్‌ మాతృమూర్తి, సినీ నేపధ్యగాయని ఎస్‌పీ శైలజ అత్తమ్మ అయిన ఎస్‌ఎస్‌ కాంతం (82) మంగళవారం చెన్నైలో కన్నుమూశారు. చెన్నై మహాలింగపురంలోని సుధాకర్‌ నివాసంలో తండ్రి సూరావజ్జల కృష్ణారావు, తల్లి ఎస్‌ఎస్‌ కాంతం ఉండేవారు. రెండేళ్ల క్రితం కృష్ణారావు మరణించారు.

తల్లి కాంతం సుమారు మూడు నెలల క్రితం గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆమె ఆరోగ్యం మరింత క్షీణించగా వృద్ధాప్య, అనారోగ్య కారణాలతో మంగళవారం ఉదయం ఆమె మృతి చెందారు. కృష్ణారావు, కాంతం దంపతులకు ముగ్గురు కుమారులు కాగా సుధాకర్‌ పెద్దవారు. రెండో కుమారుడు మురళీ దత్తుపోయి వైజాగ్‌లో, మూడో కుమారుడు సాగర్‌ అట్లాంటాలో స్థిరపడ్డారు. బుధవారం మధ్యాహ్నం చెన్నైలో ఆమె అంత్యక్రియలు జరుగనున్నాయి. కాగా ఏఐటీఎఫ్‌ అధ్యక్షులు డాక్టర్‌ సీఎంకే రెడ్డి.. కాంతం భౌతికకాయానికి ఘన నివాళి  అర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement