Actor Sri Simha Speech At Ustaad Teaser Launch Event - Sakshi
Sakshi News home page

షూటింగ్‌ సమయంలోనే బైక్‌ రైడింగ్‌ నేర్చుకున్నా: శ్రీ సింహా

Apr 13 2023 9:03 AM | Updated on Apr 13 2023 11:29 AM

Actor Sri Simha Speech At Ustaad Teaser Launch Event - Sakshi

‘‘ఉస్తాద్‌’ టీజర్‌ చాలా ఆసక్తిగా ఉంది. టీమ్‌ అందరూ కలిసి ఓ మంచి సినిమా తీశారని  అనుకుంటున్నాను’’ అన్నారు రానా. శ్రీ సింహా కోడూరి, కావ్యా కల్యాణ్‌ రామ్‌ జంటగా వారాహి చలన చిత్రం, క్రిషి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై రజినీ కొర్రపాటి, రాకేష్‌ రెడ్డి గడ్డం, హిమాంక్‌ రెడ్డి దువ్వూరు నిర్మిస్తున్న చిత్రం ‘ఉస్తాద్‌’. బుధవారం ఈ సినిమా టీజర్‌ను రిలీజ్‌ చేసిన రానా మాట్లాడుతూ– ‘‘హీరో శ్రీ సింహాతో సహా దాదాపు ‘ఉస్తాద్‌’ చిత్రబృందం అందరితో నాకు మంచి అనుబంధం ఉంది.

నిర్మాత రాకేష్‌ నా నంబర్‌వన్‌ యారి షో చేశాడు. మరో నిర్మాత హిమాంక్‌ నా టాలెంట్‌ ఏజెన్సీని నడిపాడు. ఇక ‘బాహుబలి’ టైమ్‌లో ఐదేళ్ల పాటు శ్రీసింహాతో కలిసి ట్రావెల్‌ చేశాను. ‘ఉస్తాద్‌’ విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో హీరోకి బైక్‌ ఎలాగైతే ఉస్తాద్‌ అయ్యిందో నాక్కూడా అలాగే అయ్యింది. ఎందుకంటే షూటింగ్‌ సమయంలో బైక్‌ రైడింగ్‌ బాగా నేర్చుకున్నాను.

టీజర్‌ అందరికీ నచ్చే ఉంటుందని భావిస్తున్నాను’’ అన్నారు శ్రీ సింహా. ‘‘టీజర్‌లో మీరు చూసింది చాలా తక్కువ. సినిమా పెద్ద స్థాయిలో ఉంటుంది’’ అన్నారు రాకేష్‌. ‘‘రెండేళ్ల ముందే ఈ టైటిల్‌ను రిజిస్టర్‌ చేయించాం. నాతో సహా ఈ సినిమాతో చాలామంది జర్నీని స్టార్ట్‌ చేశారు’’ అన్నారు ఫణిదీప్‌. 

Advertisement
 
Advertisement
Advertisement