కార్తీక్ రాజు, త్వరిత నగర్ హీరో హీరోయిన్లుగా కొత్త చిత్రం! | Actor Karthik Raju New Movie Launch | Sakshi
Sakshi News home page

కార్తీక్ రాజు, త్వరిత నగర్ హీరో హీరోయిన్లుగా కొత్త చిత్రం!

Nov 12 2022 12:50 AM | Updated on Nov 12 2022 10:31 AM

Actor Karthik Raju New Movie Launch - Sakshi

కార్తీక్‌ రాజు, త్వరిత, అవనింద్ర కుమార్‌

కార్తీక్‌ రాజు, త్వరిత నగర్‌ జంటగా అంజీ రామ్‌ దర్శకత్వంలో కొత్త సినిమా ప్రారంభమైంది.  దండమూడి బాక్సాఫీస్, సాయి స్రవంతి మూవీస్‌పై దండమూడి అవనింద్ర కుమార్‌ నిర్మిస్తున్నారు. తొలి సీన్‌కి ప్రముఖ గాయకుడు మనో కెమెరా స్విచ్చాన్‌ చేయగా, దండమూడి అవనింద్ర కుమార్‌ క్లాప్‌ కొట్టారు. హీరో ఆకాష్‌ పూరి గౌరవ దర్శకత్వం వహించగా, పాటల రచయిత భాస్కరభట్ల స్క్రిప్ట్‌ను యూనిట్‌కి అందించారు.

దండమూడి అవనింద్ర కుమార్‌ మాట్లాడుతూ– ‘ఈ సినిమాను హైద‌రాబాద్‌, బ్యాంకాక్, పుకెట్ స‌హా ప‌లు ప్రాంతాల్లో చిత్రీక‌రించ‌టానికి స‌న్నాహాలు చేశాం. 35-40 రోజుల్లో మూవీ షూటింగ్‌ను పూర్తి చేయాల‌నేది మా ప్లాన్‌. అంద‌రూ మా యూనిట్‌ను ఆశీర్వ‌దించాల‌ని కోరుకుంటున్నాం’ అన్నారు.  ‘‘సింగిల్‌ షెడ్యూల్‌లో పూర్తి చేయాలనుకుంటున్నాం’’ అన్నారు ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ గొట్టిపాటి సాయి. ‘‘ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న నేరాల ఆధారంగా రాసుకున్న కథ ఇది’’ అన్నారు అంజీ రామ్‌. ఈ చిత్రానికి కెమెరా: ఎస్‌. మురళీమోహన్‌ రెడ్డి, సంగీతం: అనుదీప్‌ దేవ్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement