Actor Priyadarsi: ఇక్కడ నోరు దగ్గర పెట్టుకోవాలి, లేదంటే చాలా జరిగిపోతాయి: ప్రియదర్శి

Actor, Comedian Priyadarshi Interesting Comments on Latest Interview - Sakshi

‘పెళ్లి చూపులు’ సినిమాతో ఒక్కసారిగా అందరిని దృష్టిని ఆకర్షించాడు నటుడు ప్రియదర్శి. తనదైన నటన, కామెడీతో మెప్పించాడు. ‘నా చావు నేను చస్తా నీకెందుకు’ అనే డైలాగ్‌తో ప్రేక్షకులను కడుబ్బా నవ్వించాడు. ఈ ఒక్క డైలాగ్‌తో ప్రియదర్శి రాత్రి రాత్రే స్టార్‌ డమ్‌ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ది ఘాజి ఎటాక్, అర్జున్ రెడ్డి, జై లవకుశ, జాతి రత్నాలు, రాధే శ్యామ్, సీతారామం, ఒకే ఒక జీవితం వంటి సినిమాల్లో నటించాడు. ప్రస్తుతం కమెడియన్‌గా, నటుడి వరుస ఆఫర్లు అందుకుంటున్నాడు.

చదవండి: అర్జున్‌ రెడ్డిలో శివ పాత్రకు ఫస్ట్‌ చాయిస్‌ నేను కాదు, ఆ కమెడియన్‌: రాహుల్‌ రామ్‌కృష్ణ

ఈ నేపథ్యంలో కమెడియన్‌ రాహుల్‌ రామకృష్ణతో కలిసి ఇటీవల ఓ టాక్‌ షోలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా అతడు తన వ్యక్తిగత విషయాలను, సినిమా విశేషాలను పంచుకున్నాడు. అయితే ఇండస్ట్రీలో మనకు నచ్చనిది నచ్చలేదని చెప్పడం చాల కష్టమని, నో చెప్పడం కూడా ఓ కళ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మేరకు ప్రియదర్శి మాట్లాడుతూ.. ‘ఇప్పటి వరకు నేను నాకు తగిన పాత్రలే చేస్తూ వచ్చాను. నాకు నచ్చకపోతే సున్నితంగానే నో చెప్పేస్తా. కానీ, ఇక్కడ నో చెప్పడం పెద్ద కళనే.

చదవండి: జబర్దస్త్‌ ‘పంచ్‌’ ప్రసాద్‌ ఆరోగ్యంపై డాక్టర్లు ఏమన్నారంటే?

మనకు నచ్చనిది.. నచ్చలేదని చెప్తే వాడికి తలపొగరంటూ ప్రచారం చేస్తారు. ఇతనో పెద్ద ఆర్టిస్ట్‌.. ఇతనికి నచ్చాలట.. అని అవేవో అనేసుకుంటారు’ అని చెప్పుకొచ్చాడు. అందుకే ఇక్కడ నోరు దగ్గర పెట్టుకోని మాట్లాడాలని, లేదంట మనకు ప్రమేయం లేకుండానే చాలా జరిపోతాయంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఒకవేళ తన నచ్చని సినిమాలకు చెప్పడం ఇబ్బంది అనిపిస్తే తన మేనేజర్‌ హ్యాండిల్‌ చేస్తాడని చెప్పాడు. ఇక నటుడిగా గుర్తింపు వచ్చిన తర్వాత కోపాన్ని తగ్గించుకుని, మరింత జాగ్రతగా ఉండటం నేర్చుకుంటున్నానని అన్నాడు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top