Abishek Ambareesh: నటి సుమలత తనయుడి పెళ్లి.. సెలబ్రిటీల హాజరు

దివంగత నటుడు అంబరీష్, ప్రముఖ నటి సుమలతల తనయుడు అభిషేక్ జీవితంలో కొత్త అధ్యాయానికి నాంది పలికాడు. ఎంటర్‌ప్రెన్యూర్ అవివా బిడప్పతో ఏడడుగులు వేశాడు. వేదమంత్రాల సాక్షిగా ఆమె మెడలో మూడు ముళ్లు వేశాడు. సోమవారం (జూన్ 5) బెంగళూరులో వీరి వివాహం ఘనంగా జరిగింది. ఈ పెళ్లికి సూపర్ స్టార్ రజనీకాంత్, యశ్, మోహన్‌బాబు సహా పలువురు సినీతారలతో పాటు వెంకయ్యనాయుడు వంటి ప్రముఖ రాజకీయ నేతలు సైతం హాజరయ్యారు.
నెట్టింట కొత్త జంట ఫోటోలు వైరల్
అభిషేక్ పెళ్లికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఫోటోల్లో రజనీకాంత్, యశ్‌లతో పాటు కిచ్చా సుదీప్, దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్ భార్య అశ్విని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇకపోతే జూన్ 7న అభిషేక్-అవివాల రిసెప్షన్ వేడుక జరగనుంది. కాగా అభిషేక్-అవివా కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. వీరి ప్రేమను అర్థం చేసుకున్న పెద్దలు పెళ్లికి పచ్చజెండా ఊపారు. ఈ క్రమంలో గతేడాది డిసెంబర్‌లో వీరి ఎంగేజ్‌మెంట్ జరిగింది.
అభిషేక్ పేరెంట్స్ బ్యాగ్రౌండ్..
1985లో వచ్చిన కన్నడ చిత్రం ఆహుతి సెట్స్‌లో అంబరీష్, సుమలత మొదటిసారి కలుసుకున్నారు. అలా మొదలైన పరిచయం స్నేహంగా మారింది. ఆ తర్వాత మరింత దగ్గరైన వీరు 1991 డిసెంబర్ 8న పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ హీరోహీరోయిన్లుగా ఆహుతి, అవతార పురుషా, శ్రీ మంజునాథ, కళ్లరాలై హువగీ తదితర సినిమాల్లో జంటగా నటించారు. వీరి ఏకైక సంతానం అభిషేక్ గౌడ. కన్నడ ఇండస్ట్రీలో రెబల్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న అంబరీష్ రాజకీయంగానూ చురుకుగా ఉండేవారు. 2018 నవంబర్ 24న అంబరీష్ గుండెపోటుతో కన్నుమూశారు. తెలుగు, కన్నడ భాషల్లో అనేక చిత్రాలు చేసిన సుమలత ప్రస్తుతం మాండ్య నియోజకవర్గం ఎంపీగా సేవలందిస్తోంది.
Snaps of Rocking Star @TheNameIsYash Boss
Happy Married Life #AbhishekAmbareesh & Aviva Bidapa ❤️#YashBOSS #Yash19 pic.twitter.com/hgDohWoQNQ— Yash Trends ™ (@YashTrends) June 5, 2023
The #Rocking couple, @TheNameIsYash and @RadhikaPandit7, at the wedding ceremony of #AbishekAmbareesh and #AvivaBidappa as they elegantly wish the family and embrace the newlyweds. Dressed exquisitely in their ethnically-inspired attire, add a touch of enchantment to the joyous… pic.twitter.com/BRiPlgChRH
— A Sharadhaa (@sharadasrinidhi) June 5, 2023
#Drpuneethrajkumar
Ashwini mam at Abhishek ambareesh marriage. pic.twitter.com/ivGf1BHGJl— ಅಪ್ಪು ಡೈನಾಸ್ಟಿ (@appudynasty1) June 5, 2023
Abhi-Aviva Marriage | ಅಭಿ-ಅವಿವಾ ವಿವಾಹ ಸಂದರ್ಭ ಹರ್ಷದ ಕ್ಷಣಗಳು...#RajNews #Rajnewskannada #Rajnewslive #BreakingNews #LatestNews #trending #report #sports #Government #Karnataka #AbhishekAmbareesh #SumalathaAmbareesh #Aviva #marriage #wedding pic.twitter.com/BQuBrT9ubC
— Raj News Kannada (@officialrajnews) June 5, 2023
చదవండి: ఆ హీరో సినిమా వస్తుందంటే చాలు.. టీవీకి ముద్దుపెట్టేవారు