Aashiqui Actress Anu Aggarwal on Being in a Live-in Relationship - Sakshi
Sakshi News home page

Anu Aggarwal: నా జీవితం తలకిందులైంది.. కానీ ఏమి చేయలేకపోయా: ఆషికి నటి

Published Thu, Jan 12 2023 1:30 PM

Aashiqui actress Anu Aggarwal on being in a live-in relationship - Sakshi

బాలీవుడ్ నటి అను అగర్వాల్ గురించి చాలామందికి తెలియదు. టాలీవుడ్‌లో దొంగ దొంగది సినిమాలో అలరించింది. అయితే అనుకోని  అంతకుముందే ఆషికి సినిమాతో బాలీవుడ్‌లో ఫేమ్ సాధించింది. ఆమె నటించిన ఆషికి సూపర్‌హిట్‌గా నిలిచింది. రోడ్డు ప్రమాదంతో కోమాలోకి వెళ్లిడంతో కెరీర్ బ్రేక్ పడింది. తాజాగా ఆమె తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఓ వ్యక్తితో తాను సహజీవనం చేసినట్లు వెల్లడించింది. అయితే దానివల్ల తన వ్యక్తిగత జీవితం నాశమైందని తెలిపింది. 

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అను అగర్వాల్ మాట్లాడుతూ..'నేను ఓ వ్యక్తితో సహజీవనం చేశా. అయితే అతని తల్లి కూడా మాతో నివసించింది. ఆమె కూడా నన్ను అంగీకరించింది. కానీ ఆమె స్నేహితులు నా గురించి చెడుగా చెప్పారు. అంతేకాకుండా పత్రికల్లో నా గురించి వ్రాసిన విషయాలను నమ్మారు. దీంతో నా జీవితం నాశనమైంది. ఆ సమయంలో నన్ను నేను రక్షించుకోవడానికి నాకు ఎలాంటి మార్గాలు లేవు. అప్పట్లో సోషల్ మీడియా కూడా లేదు. దీంతో నా వ్యక్తిగత జీవితాన్ని కోల్పోయా'. అని అన్నారు. 

అను బాలీవుడ్‌ అరంగేట్రం: 1990లో తన తొలి బాలీవుడ్ చిత్రం ఆషికి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఆ సినిమాతో అను ఓవర్‌నైట్ స్టార్ అయిపోయింది. ఆ తర్వాత నటించిన గజబ్ తమాషా, జనమ్ కుండ్లీ, కింగ్ అంకుల్, రిటర్న్ ఆఫ్ జ్యువెల్ థీఫ్ చిత్రాల్లో నటించింది. ఊహించని రోడ్డు ప్రమాదంతో సినిమాలకు దూరమైంది. 1999లో జరిగిన ఓ ప్రమాదం ఆమె జీవితాన్ని కుదిపేసింది. దాదాపు నెల రోజుల పాటు కోమాలోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం అను అగర్వాల్ ఫౌండేషన్‌ను నడుపుతూ, యోగా క్లాసులు నిర్వహిస్తోంది.

Advertisement
 
Advertisement
 
Advertisement