Aamir Khan Mother Zeenat Hussein Suffers Severe Heart Attack - Sakshi
Sakshi News home page

Aamir Khan: అమిర్‌ ఖాన్‌ తల్లికి  తీవ్ర గుండెపోటు..  ఆసుపత్రికి తరలింపు

Oct 31 2022 10:11 AM | Updated on Oct 31 2022 11:39 AM

Aamir Khan Mother Zeenat Hussein Suffers Severe Heart Attack - Sakshi

బాలీవుడ్‌ స్టార్‌ హీరో అమిర్‌ ఖాన్‌ తల్లి జీనత్‌ హుస్సేన్‌ గుండెపోటుతో ఆసుపత్రిలో చేరారు. ముంబైలోని  పంచగని నివాసంలో ఆమిర్ ఖాన్ కుటుంబం దీపావళి వేడుకల్లో ఉండగా, గుండెపోటుతో జీనత్ కుప్పకూలిపోయినట్టు తెలుస్తోంది. దీంతో ఆమెను వెంటనే బ్రీచ్ కాండీ ఆసుపత్రికి తరలించారు.

ప్రస్తుతం జీనత్‌ పరిస్థితి నిలకడగా ఉందని సమాచారం. ఆమె నెమ్మదిగా కోలుకుంటున్నారని,  చికిత్సకు స్పందిస్తున్నారని వైద్యులు తెలిపారు.ప్రస్తుతం అమిర్‌ ఆసుపత్రిలోనే ఉన్నాడని తెలుస్తుంది.

కాగా అమిర్‌ ఖాన్‌ చివరగా లాల్‌ సింగ్‌ చద్దా అనే సినిమాలో నటించారు. కరీనా కపూర్‌ హీరోయిన్‌గా, నాగచైతన్య  కీలక పాత్ర పోషించిన ఈ సినిమా ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement