Aamir Khan Film Laal Singh Chaddha Streaming On OTT Platform Netflix - Sakshi
Sakshi News home page

Laal Singh Chaddha: ఓటీటీలో లాల్ సింగ్ చడ్డా.. ఎంచక్కా చూసేయండి..!

Oct 6 2022 4:27 PM | Updated on Oct 6 2022 4:55 PM

Amir Khan Film Laal Singh Chaddha Streaming On OTT Platform Netflix - Sakshi

అమిర్‌ ఖాన్‌ టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం ‘లాల్‌సింగ్‌ చడ్డా’. ఆస్కార్‌ విన్నింగ్‌ ఫిల్మ్‌ ‘ఫారెస్ట్‌ గంప్‌’కు హిందీ రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రానికి అద్వైత్‌ చందన్‌ దర్శకుడు. కరీనా కపూర్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో టాలీవుడ్ హీరో నాగచైతన్య కీలక పాత్ర చేశారు. ఈ సినిమా ఆగస్టు 11న రిలీజ్ కాగా.. బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. తెలుగులోనూ విడుదలైన సినిమా అభిమానులను మెప్పించలేకపోయింది. 

(చదవండి: గాడ్‌ఫాదర్‌ ఫస్ట్‌డే కలెక్షన్స్‌ ఎలా ఉన్నాయంటే)

అయితే తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌ సంస్థ విషయాన్ని ధృవీకరించింది. సినిమా విడుదలైన ఎనిమిది వారాల్లోనే ఓటీటీలోకి ఎంట్రీ ఇచ‍్చింది. నెట్‌ఫ్లిక్స్ తన ఇన్‌స్టాలో 'లాల్ సింగ్ చడ్డా ఇప్పుడు ప్రసారమవుతోంది. మీ పాప్‌కార్న్, పానీపూరీలను సిద్ధంగా ఉంచుకోండి' అని క్యాప్షన్ ఇచ్చింది. కొందరు అభిమానులు ఈ సినిమా విడుదలై అప్పుడే ఆరు నెలలవుతోందా అని చమత్కరించారు. థియేట్రికల్ విడుదలైన ఆరు నెలల తర్వాత సినిమా OTT విడుదలవుతుందని గతంలోనే అమిర్ ఖాన్ చెప్పారు. సాధారణంగా ఓటీటీలో రిలీజ్ చేసేటప్పుడు సినిమా ప్రమోషన్లు నిర్వహిస్తారు. కానీ లాల్ సింగ్ చడ్డా ఎలాంటి హడావుడి లేకుండానే ఓటీటీలోకి వచ్చేసింది. 

Advertisement
 
Advertisement
Advertisement