బెంజ్‌ కారు కొన్న యంగ్‌ హీరో.. ఫోటోలు వైరల్‌ | Sakshi
Sakshi News home page

Aadi Sai Kumar: బెంజ్‌ కారు కొన్న యంగ్‌ హీరో.. ఫోటోలు వైరల్‌

Published Sat, Jan 8 2022 4:35 PM

Aadi Sai Kumar Buys Benz Car, Pics Goes viral - Sakshi

Aadi Sai Kumar Buys Benz Car, Pics Goes viral: ఆది సాయికుమార్‌ లేటెస్ట్‌ మూవీ 'అతిథి దేవోభవ' ప్రస్తుతం థియేటర్స్‌లో సందడి చేస్తుంది. లవ్‌, యాక్షన్‌ ఓరియెంటెండ్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 7న థియేటర్స్‌లో విడుదలైన సంగతి తెలిసిందే. పొలిమేర నాగేశ్వర్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కాగా ఈ ఏడాది కొత్త సినిమాతో పలకరించిన ఆది సాయికుమార్‌ ఇప్పుడు తన ఇంట్లోకి కూడా కొత్త కారును ఆహ్వానించాడు.

ఖరీదైన బెంజ్‌ కారును కొనుగోలు చేసి దానికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. ఈ సందర్భంగా భార్య, కూతురితో పాటు తండ్రి సాయికుమార్‌తో దిగిన ఫోటోలను షేర్‌ చేశాడు. ప్రస్తుతం ఆది సాయికుమార్‌ చేతిలో ఆర డజనుకు పైగా సినిమాలున్నాయి. 

Advertisement
 
Advertisement
 
Advertisement