సమయం వృథా చేయొద్దు | - | Sakshi
Sakshi News home page

సమయం వృథా చేయొద్దు

Nov 19 2026 1:48 PM | Updated on Nov 19 2026 1:48 PM

హవేళిఘణాపూర్‌(మెదక్‌): ప్రతీ విద్యార్థి కొత్త ఆవిష్కరణలతో ముందుకెళ్తే అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చని ప్రభుత్వ మాజీ ఐటీ సలహాదారు, రతన్‌ టాటా ఇంక్యుబేషన్‌ సీఈఓ డాక్టర్‌ హఫీజ్‌భాష అన్నారు. బుధవారం మెదక్‌ గిరిజన ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ రమాదేవి అధ్యక్షతన జరిగిన గ్రాడ్యుయేషన్‌ డే కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత చేసే ప్రతీ ఆలోచన కొత్త ఆవిష్కరణకు మూలమవుతుందని, డిగ్రీ స్థాయిలో సమయాన్ని వృథా చేయకుండా వినూత్నమైన ఆలోచనలతో ముందుకెళ్లాలని సూచించారు. ప్రిన్సిపాల్‌ రమాదేవి మాట్లాడుతూ.. విద్యార్థులు కష్టపడి చదివి కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని, ప్రతీ నిమిషం జీవితంలో ఎంతో విలువైందని గుర్తించాలని సూచించారు. కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపాల్‌ శరత్‌దీపిక, అల్యూమిని అసోసియేషన్‌ కో–ఆర్డినేటర్‌ అర్చన కులకర్ణి, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement