డీఎస్పీ నరేందర్ గౌడ్
తూప్రాన్: విద్యార్థినులు చిన్నప్పటి నుంచే స్వీయ రక్షణ మెళకువలు నేర్చుకొని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని డీఎస్పీ నరేందర్‌గౌడ్ సూచించారు. గురువారం తూప్రాన్ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ము ఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వ్యక్తిగత భద్రతపై అవగాహన కలిగి ఉండటంతో పాటు ఆపద సమయాల్లో ధైర్యంగా వ్య వహరించాలని పిలుపునిచ్చారు. అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎ లాంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనా భయపడకుండా ధైర్యంగా ఎదుర్కోవాలని తెలిపారు. అవసరమైనప్పుడు పోలీసుల సహాయం తీసుకోవాలని, మహిళల భద్రతకు పోలీస్ శాఖ నిరంతరం అందుబా టులో ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో ఎంఈఓ సత్యనారాయణ, ఎస్‌ఐ జ్యోతి, షీటీం సభ్యులు, పోలీస్ సిబ్బంది, కరాటే మాస్టర్లు పాల్గొన్నారు.
నారాయణఖేడ్: సిద్దిపేటలో గురువారం జరగనున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సభ కోసం ఖేడ్ ఆర్టీసీ డిపో నుంచి 30 బస్సులను పంపుతున్నట్లు డీఎం సుబ్రహ్మణ్యం తెలిపారు. దీంతో డిపో పరిధిలోని వివిధ గ్రామాలకు నడిచే కొన్ని బస్సులు తాత్కాలికంగా అందుబాటులో ఉండక అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని, ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.


