జాతీయస్థాయిలో సత్తా చాటాలి | - | Sakshi
Sakshi News home page

జాతీయస్థాయిలో సత్తా చాటాలి

Nov 19 2026 1:48 PM | Updated on Nov 19 2026 1:48 PM

మెదక్‌ కలెక్టరేట్‌: డిసెంబర్‌ 11 నుంచి 22 వరకు రాష్ట్రంలో నిర్వహించే ఖేలో ఇండియా జాతీయ క్రీడ ల్లో జిల్లాలోని యువత, క్రీడాకారులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లో ఖేలో ఇండియా జాతీయస్థాయి క్రీడలకు సంబంధించిన లోగో, వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. హైదరాబాద్‌, వ రంగల్‌, నిజామాబాద్‌, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, కరీంనగర్‌ పట్టణాల్లో జాతీయ యువజన క్రీడలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, స్పో ర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ తెలంగాణ ఆధ్వర్యంలో జాతీయ క్రీడలపై విస్తృత ప్రచారం చేయాలని క్రీడల శాఖ అధికారికి సూచించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి అంబదాస్‌ రాజేశ్వర్‌, జిల్లా యువజన క్రీడల అధికారి రమేశ్‌, ట్రైబల్‌ వెల్ఫేర్‌ అధికారిని నీలిమ, డీపీఓ యాదయ్య, డీఎల్‌పీఓ రామచంద్రరాజు, అదనపు ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ రంగాచారి, ఈడీఎం సందీప్‌ ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను పోటీ పరీక్షలకు సన్నద్ధం చేయడమే లక్ష్యంగా ఈనెల 20న జిల్లాలోని అన్ని మండలాల్లో క్విజ్‌ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే అలాగే ఇందిరమ్మ బీమా పథకం నమోదు కోసం జిల్లాలోని అన్ని పట్టణాలు, గ్రామాల్లో ప్రత్యేకంగా కౌంటర్లు, హెల్ప్‌డెస్క్‌ ఏర్పాటు చేస్తున్నామని వివరించారు.

కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement