మెదక్‌జోన్: ప్రజావాణి ఫిర్యాదులపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాధితులకు సత్వర న్యాయం అందించాలని ఎస్పీ శ్రీనివాసరావు పోలీస్ అధికారులను ఆదేశించారు. సోమ వారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో పాల్గొని ప్రజల నుంచి ఫిర్యా దులు స్వీకరించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. భూ వివాదాలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక మోసాలు, వేధింపులకు సంబంధించిన ఫిర్యాదులను పరిశీలించారు. సమగ్ర విచారణ జరిపి చట్టప్రకారం న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
పెద్దశంకరంపేట(మెదక్): అయ్యప్ప భక్తులు శబరిమలకు వెళ్లేందుకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు నారాయణఖేడ్ డిపో మే నేజర్ సుబ్రహ్మణ్యం తెలిపారు. సోమవారం పెద్దశంకరంపేట ఆర్టీసీ బస్టాండ్‌ను తనిఖీ చేశారు. ఆర్టీసీ కార్గో సేవలను పరిశీలించడంతో పాటు ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా నడుస్తున్న బస్సుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అయ్యప్ప భక్తుల కోసం ప్రత్యేక రాయితీతో శబరిమలకు బస్సులు నడుపుతున్నామని, సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆయన వెంట సిబ్బంది రాధాకిషన్, ఫరీద్ తదితరులు ఉన్నారు.
హవేళిఘణాపూర్(మెదక్): మానసిక వికాసానికి పుస్తక పఠనం ఎంతో అవసరమని డీఈఓ రాజు అన్నారు. సోమవారం జిల్లా గ్రంథాలయంలో జరిగిన వారోత్సవాల్లో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విస్తృతమైన ఆలోచనలతో వ్యాసం రాసి చక్కటి సందేశం అందిస్తున్న విద్యార్థులకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో లైబ్రేరియన్ గణేశ్, రాజు, ఉమాదేవి, మురళి, ఉపాధ్యాయులు మల్లేశం, వంశీ, రాజేశం, జయమ్మ, ప్రశాంత, శివరంజిని, ఆయా పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.
మెదక్ కలెక్టరేట్: తమను బీసీ–డీ నుంచి బీసీ–ఏలో చేర్చాలని సగరులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డిమాండ్ల సాధన కోసం కలెక్టరేట్ ఎదుట సోమవారం ధర్నా చేపట్టారు. ఈసందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు సాయిలు మాట్లాడుతూ.. సగర ఫెడరేషన్‌ను కార్పొరేషన్‌గా మార్చి పాలకమండలిని నియమించాలన్నారు. జీఓ 59ను సవరణ చేసి ప్రభుత్వ కాంట్రాక్టు పనుల్లో సగరులకు రిజర్వేషన్ శాతం పెంచాలని కోరారు. అనంతరం ర్యాలీగా తరలివెళ్లి కలెక్టరేట్‌లో డీఆర్‌ఓ అంబదాస్ రాజేశ్వర్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మర్కు నగేశ్, కోశాధికారి బాలకిషన్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దత్తాద్రి, రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
పటాన్‌చెరు టౌన్: కార్తీక సోమవారం పురస్కరించుకొని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజాము నుంచే శివనామస్మరణతో మారుమోగాయి. పట్టణంలోని జేపీ కాలనీలో ఉమామహేశ్వర దేవస్థానం, టోల్‌గేట్ సమీపంలోని రామలింగేశ్వర, చైతన్‌నగర్‌లోని మహాదేవుని ఆలయాల్లో అర్చకులు పంచామృత అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక మాసంలో శివుని దర్శనం అత్యంత పుణ్యప్రదమైనది. మహిళలు ఆలయ పరిసరాల్లో దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు.


