నర్సాపూర్ రూరల్: చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఎంపీ రఘునందన్ రావు విద్యార్థులకు సూచించారు. శుక్రవారం మండలంలోని చిప్పల్‌తూర్తి కేజీబీవీ, కళాశాలలో హెటిరో డ్రగ్స్ కంపెనీ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఆర్‌ఓ ప్లాంట్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు, ఇతర రంగాల్లో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. పీటీ ఉషను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ మల్లేశ్‌గౌడ్, జిల్లా కార్యదర్శి సంగసాని సురేశ్, జిల్లా కోశాధికారి ఆంజనేయులు గౌడ్, ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు రాములు నాయక్, మండల అధ్యక్షుడు నాగేశ్, కన్వీనర్ ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఎంపీ రఘునందన్ రావు


