32 ట్రాక్టర్ల ఇసుక సీజ్‌ | - | Sakshi
Sakshi News home page

32 ట్రాక్టర్ల ఇసుక సీజ్‌

Nov 7 2026 10:05 AM | Updated on Nov 7 2026 10:05 AM

32 ట్రాక్టర్ల ఇసుక సీజ్‌ సివిల్‌ కేసుల్లో జోక్యం వద్దు పోషకాహారం తీసుకోవాలి చట్టాలపై అవగాహన అవసరం

మెదక్‌జోన్‌: మెదక్‌ పట్టణం చుట్టూ హల్దీవాగు, పుష్పాలవాగు, పసుపులేరు, బొల్లారం మత్తడి ఉండగా, వాటిలో నుంచి గత కొన్ని రోజులుగా కొందరు ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. దీంతో భూగర్భజలాలు అడుగంటాయి. దీనిపై గత నెల 31న ‘సాక్షి’లో ‘ఇసుక తోడేళ్లు’ కథనం ప్రచురించగా, స్పందించిన అధికారులు శుక్రవారం తిమ్మక్కపల్లి శివారులో 32 ట్రాక్టర్ల ఇసుకను సీజ్‌ చేశారు. అందుకు బాధ్యులైన 15 మందిపై కేసు నమోదు చేసినట్లు మెదక్‌ తహసీల్దార్‌ లక్ష్మణ్‌బాబు తెలిపారు.

హవేళిఘణాపూర్‌(మెదక్‌): సమస్యాత్మక గ్రామాలను గుర్తించి శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేయాలని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం హవేళిఘణాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి పెండింగ్‌ కేసుల పురోగతిపై ఆరా తీశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. సివిల్‌ కేసుల్లో పోలీసులు జోక్యం చేసుకోవద్దన్నారు. న్యాయస్థానాన్ని ఆశ్రయించే విధానంపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. సైబర్‌ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండేలా ప్రజలను జాగృతం చేయాలన్నారు. కార్యక్రమంలో మెదక్‌ రూరల్‌ సీఐ కృష్ణమూర్తి, సందీప్‌రెడ్డి, ఎస్‌ఐ కృష్ణయ్య, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

తూప్రాన్‌: పట్టణంలోని అంగన్‌వాడీ కేంద్రంలో ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో శుక్రవారం గర్భిణులకు సామూహిక సీమంతాలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ శివకుమారి హాజరై మాట్లాడారు. గర్భిణులు పోషకాహారం తీసుకోవడం ఎంతో అవసరమన్నారు. తల్లి తీసుకునే పౌష్టికాహారం పైనే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం ఆధారపడి ఉంటుందన్నారు. నిత్యం ఆహారంలో ఆకుకూరలు, తాజా పండ్లు, కూరగాయలు, మాంసం వంటి పోషక విలువలు కలిగిన ఆహారం భాగం చేసుకోవాలని సూచించారు.

అల్లాదుర్గం(మెదక్‌): పేదలు ఉచిత న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలని జూనియర్‌ సివిల్‌ జడ్జి సుచరిత అన్నారు. శుక్రవారం స్థానిక కోర్టులో జాతీయ న్యాయ సేవా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సమాజంలోని ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. చట్టపరమైన సమస్యలు ఎదురైనప్పుడు వాటిని పరిష్కరించుకునేందుకు, చట్టబద్ధమైన మార్గాలను అనుసరించాలని సూచించారు. మండల లీగల్‌ సర్వీస్‌ కమిటీ ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉచిత న్యాయ సహాయం అందుబాటులో ఉందని, ఆర్థిక స్థోమత లేని పేదలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో న్యాయవాదులు, లోక్‌ అదాలత్‌ బెంచ్‌ మెంబర్‌ అంజయ్య, సంగయ్య, కోర్టు సూపరింటెండెంట్‌ పద్మావతి, లీగల్‌ సర్వీస్‌ సిబ్బంది ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement