రైతుల గోస పట్టని సర్కారు | - | Sakshi
Sakshi News home page

రైతుల గోస పట్టని సర్కారు

Nov 7 2026 10:05 AM | Updated on Nov 7 2026 10:05 AM

చిలప్‌చెడ్‌(నర్సాపూర్‌): విద్యుత్‌ కోతలతో చేతికొచ్చిన పంటలు నష్టపోయి రైతులు అరిగోస పడుతున్నా ప్రభుత్వానికి పట్టడం లేదని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. శుక్రవారం ఎమ్మెల్యే సునీతారెడ్డితో కలిసి మండలంలోని అంతారం, సామ్లాతండా, సోమక్కపేట్‌, గంగారం శివారులలో ఎండిపోయిన పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఎంత అప్పు చేశారు..? ఏ కారణాలతో పంటలు ఎండిపోయాయని ఆరా తీశారు. విద్యుత్‌ కోతలతో మోటార్లు కాలిపోవడంతో అదనపు ఖర్చులయ్యాయని, రూ. లక్షలోపు ఉన్నా రుణమాఫీ జరగలేదని రైతులు వివరించారు. మార్పు, మార్పు అన్న రేవంత్‌రెడ్డి రైతులకు చేసిందేమిలేదన్నారు. పచ్చని పొలాలతో ఉండే చిలప్‌చెడ్‌ మండలం, 50 శాతం పైగా పంటలు ఎండిపోవడానికి కాంగ్రెస్‌ ప్రభుత్వమే కారణమన్నారు. కేసీఆర్‌ అమలుల్లోకి తీసుకువచ్చిన రైతుబీమా పథకాన్ని తుంగలో తొక్కి, చనిపోయన రైతుల కుటుంబాలను ఆవేదనకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. బాలింతలకు కనీసం కిట్లు ఇవ్వలేని దీనస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. కాంగ్రెస్‌ మెడలు వంచి అయినా రైతులకు నష్టపరిహారం అందేలా చేస్తామన్నారు. కార్యక్రమంలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌, బీఆర్‌ఎస్‌ మండల పార్టీ అధ్యక్షుడు ఆశోక్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు లక్ష్మణ్‌, సర్పంచ్‌లు అనిల్‌, బలవంత్‌రెడ్డి, కున్యానాయక్‌, రాములు, సొసైటీ చైర్మన్‌ ధర్మారెడ్డి, నాయకులు ఉమన్నగారి దేవేందర్‌రెడ్డి, దుర్గారెడ్డి, నాయకులు తదితరులు, పాల్గొన్నారు.

ఎంత సాగుచేశారు.. పండింది ఎంత?

కౌడిపల్లి(నర్సాపూర్‌): ఎంత సాగుచేశారు.. పండింది ఎంత అని రైతులను మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే సునీతారెడ్డి అడిగి తెలుసకున్నారు. శుక్రవారం చిలప్‌చెడ్‌ పర్యటనకు వెళ్తూ మార్గమధ్యలో మండలంలోని నాగ్సాన్‌పల్లి, కొత్తచెరువుతండా వద్ద రైతులను చూసి ఆగారు. రెండెకరాలు సాగుచేయగా, ఎకరం మాత్రమే పండిందని, బోరు బావిలో నీళ్లున్నా, కరెంట్‌ లేక పంట ఎండిందని రైతులు వాపోయారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారా..? ధాన్యం కొంటున్నారా అని ఆరా తీశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ మండల పార్టీ అధ్యక్షుడు సార రామాగౌడ్‌, సర్పంచ్‌లు పద్మ, ఎల్లం,కుత్‌బొద్దీన్‌, నాయకులు శంకర్‌నాయక్‌, రామాంజనేయులు, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.

మాజీ మంత్రి హరీశ్‌రావు ఫైర్‌

ఎమ్మెల్యే సునీతారెడ్డితో కలిసి

ఎండిన వరి పంటల పరిశీలన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement