పెద్దశంకరంపేట(మెదక్): మండలంలో నెలకొన్న కరువు పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వెంటనే కరువు ప్రాంతంగా ప్రకటించాలని కోరుతూ గురువారం నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ఆందోళన నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ నారాయణకు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా భూపాల్ రెడ్డి మాట్లాడుతూ.. పంటలు ఎండిపోయి పెట్టుబడులు నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాల్సిన స్థానిక ఎమ్మెల్యే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రైతులకిచ్చిన హామీలను ప్రభుత్వం విస్మరించిందని, రైతుబంధు నిధులను వెంటనే విడుదల చేయాలన్నారు. పంట నష్టపోయిన వారికి నష్టపరిహారం అందించాలని, రైతుబీమా పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జంగం శ్రీనివాస్, నాయకులు సురేశ్‌గౌడ్, సత్యనారాయణ, రమేశ్, దత్తు, జంగం రాఘవులు, సుభాశ్, రవీందర్, వెంకటరెడ్డి, సాయిలు, అంజయ్య, శంకరగౌడ్, నర్సింలు, హుస్సేన్ పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి


