హవేళిఘణాపూర్(మెదక్): మెదక్ పట్టణంలోని వెస్లీ కళాశాలలో నిర్వహించిన జిల్లాస్థాయి క్రీడలు రెండో రోజు కొనసాగాయి. బుధవారం జిల్లా స్థాయి పీఎంశ్రీ బాల బాలికల అండర్–17 ఖోఖో క్రీడలు నిర్వహించారు. 31 పాఠశాలలకు చెందిన 750 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఖోఖోలో కుసంగి మొదటి స్థానం, వాలీబాల్‌లో మొదటి విజేత టీజీఎంఎస్ జక్కపల్లి, బాలుర వాలీబాల్ పోటీల్లో టీజీఆర్ఎస్ తూప్రాన్, ఖోఖోలో టీజీఆర్ఎస్ తూప్రాన్ విద్యార్థులు మొదటి స్థానంలో విజేతలుగా నిలిచారు. కార్యక్రమానికి డీఈఓ రాజు హాజరై గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో కో–ఆర్డినేటర్ సుదర్శన్‌మూర్తి, శ్రీనివాసరావు, మధుసూదన్, పీడీలు మాధవరెడ్డి, శ్యాం, శ్రీధర్‌రెడ్డి, దేవేందర్‌రెడ్డి, సత్యనారాయణ, రూపేందర్, విజయ్, కృష్ణ, కిషోర్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.


