శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు | - | Sakshi
Sakshi News home page

శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు

Nov 5 2026 8:44 AM | Updated on Nov 5 2026 8:44 AM

అదనపు ఎస్పీ విక్రాంత్‌కుమార్‌ సింగ్‌

అదనపు ఎస్పీ విక్రాంత్‌కుమార్‌ సింగ్‌

తూప్రాన్‌: నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా పట్టణంలోని డబుల్‌ బెడ్రూం కాలనీలో బుధవారం పోలీసులు కార్డెన్‌ సెర్చ్‌ నిర్వహించారు. అదనపు ఎస్పీ విక్రాంత్‌ కుమార్‌ సింగ్‌ నేతృత్వంలో 105 మంది సిబ్బంది ఏకకాలంలో 450కి పైగా ఇళ్లలో తనిఖీలు చేపట్టారు. సరైన పత్రాలు లేని 61 బైక్‌లు, 3 వాహనాలు కలిపి మొత్తం 64 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈసందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల గుర్తింపునకు నార్కోటిక్‌ డాగ్‌, పాత నేరస్తుల వేట కోసం అధునాతన ఫింగర్‌ ప్రింట్‌ డివైజ్‌లతో తనిఖీలు చేపట్టామన్నారు. ఈ సోదాలు సాధారణ ప్రజలను ఇబ్బంది పెట్టడానికి కాదని, వారి భద్రతకు పూర్తి భరోసా కల్పించడానికేనని స్పష్టం చేశారు. అసాంఘిక కార్యకలాపాలపై ప్రజలు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వా లని కోరారు. కార్యక్రమంలో తూప్రాన్‌ డీఎస్పీ నరేందర్‌ గౌడ్‌, సీఐలు వెంకటరాజ్‌ గౌడ్‌, రంగకృష్ణ, షీ టీమ్స్‌, డాగ్‌ స్క్వాడ్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement