పద్ధతి మార్చుకోరా..? | - | Sakshi
Sakshi News home page

పద్ధతి మార్చుకోరా..?

Nov 5 2026 8:44 AM | Updated on Nov 5 2026 8:44 AM

జలసిరి పనుల నిర్లక్ష్యంపై డీఎల్‌పీఓ ఆగ్రహం

జలసిరి పనుల నిర్లక్ష్యంపై డీఎల్‌పీఓ ఆగ్రహం

కౌడిపల్లి(నర్సాపూర్‌): నాలుగు నెలలుగా చెబుతున్నా మీ పద్ధతి మారడం లేదు.. ఇలాగే నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులపై డీఎల్‌పీఓ సురేశ్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం కౌడిపల్లి రైతువేదికలో వీబీజీరాంజీ అధికారులు, పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో జలసిరి పనులు ప్రారంభించాలని, ఉపాధిహామీ కూలీల సంఖ్య పెంచాలని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. సమీక్ష సమా వేశానికి ఫీల్డ్‌ అసిస్టెంట్లను రమ్మని చెప్పినప్పటికీ, రాకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. ప్రభు త్వం భూగర్భజలాల అభివృద్ధికి జలసిరి పనులు ఇంటింటికీ ఇంకుడుగుంతలు, బోర్‌వెల్‌ రీఛార్జ్‌ గుంతలు, ఫాంపాండ్‌ పనులు చేపట్టాలని సూచించారు. అన్ని గ్రామాలు, తండాలలో కూలీల సంఖ్యను పెంచి పనులు సక్రమంగా చేయకపోతే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో ఎంపీడీఓ శ్రీనివాస్‌, ఎంపీఓ రామారావు, ఏపీఓ పుణ్యదాస్‌, ఈసీ ప్రేంకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement