కొల్చారం(నర్సాపూర్): వానాకాలం సీజన్‌లో రైతులు పత్తిలో అంతర పంటగా కందిని సాగు చేశా రు. అయితే ఎల్‌నినో ప్రభావంతో ఈసారి వర్షాలు సరిగా కురువక పత్తి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఎకరం సాగు చేస్తే రెండు నుంచి మూడు క్వింటాళ్లు మాత్రమే దిగుబడి వచ్చిందని చెబుతున్నారు. ప్రస్తుతం కంది పంట కాయ తొడిగి విరగకాసింది. గింజ తొడుగుతున్న ప్రస్తుత తరుణంలో కొద్దిపాటి వర్షం పడినా పంట చేతికొస్తుందన్న గంపెడు ఆశతో రైతులు ఎదురుచూస్తున్నారు. అయితే రైతులను ఏ మేర వరుణ దేవుడు కరుణిస్తాడన్నది వేచి చూడాలి.


