రసాయన ఎరువుల వాడకం తగ్గించాలి | - | Sakshi
Sakshi News home page

రసాయన ఎరువుల వాడకం తగ్గించాలి

Nov 6 2026 11:21 AM | Updated on Nov 6 2026 11:21 AM

జిల్లా వ్యవసాయ అధికారి దేవ్‌కుమార్‌

నర్సాపూర్‌ రూరల్‌: రసాయన ఎరువుల వాడకాన్ని పూర్తిగా తగ్గించి, సహజ వ్యవసాయం చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి దేవ్‌కుమార్‌ రైతులకు సూచించారు. గురువారం మండలంలోని చిన్నచింతకుంట, జక్కపల్లి గ్రామాల్లో జాతీయ సహజ వ్యవసాయ మిషన్‌ పథకానికి ఎంపికై న రైతులకు కౌడిపల్లి మండలంలోని తునికి కృషి విజ్ఞాన కేంద్రంలో ఒక రోజు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సహజ వ్యవసాయంతో భూసారం పెరగడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ఎంతగానో ఉపయోగపడుతుందని వివరించారు. పెట్టుబడులు తగ్గించుకోవడంతో పాటు దిగుబడులు పెంచుకునే అంశాలను తెలియజేశారు. రసాయన ఎరువులు, పురుగుల మందుల వాడకాన్ని పూర్తిగా తగ్గించాలని తెలిపారు. పంటల సాగులో అంతర పంటలు, జీవ జీవ వైవిధ్యాన్ని పెంపొందించడం వంటి అంశాలను కేవీకే శాస్త్రవేత్తలు రైతులకు వివరించారు. కార్యక్రమంలో ఏడీ సంధ్యారాణి, ఏఈఓలు తేజస్విని, రాజశేఖర్‌ గౌడ్‌, రైతులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement