కౌడిపల్లి(నర్సాపూర్): రైతులు వచ్చే యాసంగిలో ఆరుతడి పంటలు సాగు చేయాలని ఏఓ స్వప్న కోరారు. శనివారం మండలంలోని దేవులతండాలో ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమం నిర్వహించి రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావంతో వానాకాలం వర్షాలు సరిగ్గా కురవలేదని రైతులు వరి పంటకు బదులుగా ఆరుతడి పంటలు జొన్న, మొక్కజొన్న, సజ్జ, పొద్దుతిరుగుడు, కుసుమ, కూరగాయలు ఇతర ప్రత్యామ్నాయ పంటలు సాగుచేయాలని తెలిపారు. కార్యక్రమంలో ఏఈఓ సౌజన్య, సర్పంచ్ కోలశ్రీనివాస్, ఉపసర్పంచ్ ఛత్రనాయక్ తండావాసులు పాల్గొన్నారు.
అర్హులకే చేయూత పెన్షన్లు
డీపీఓ యాదయ్య
రేగోడ్(మెదక్): అర్హులైన లబ్ధిదారులను గుర్తించి, పారదర్శకంగా చేయూత పెన్షన్లు అందించేందుకు దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నట్లు మెదక్ డీపీఓ యాదయ్య తెలిపారు. శనివారం మండలంలోని ఆర్.ఇటిక్యాల, పోచారం, రేగోడ్, టి.లింగంపల్లి గ్రామాల్లో చేయూత పెన్షన్ కోసం వచ్చిన దరఖాస్తులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా దరఖాస్తుదారుల వివరాలు, అర్హతలను వెరిఫికేషన్ చేశారు. కార్యక్రమంలో ఎంపీఓ ఎ.గంగాధర్, సంబంధిత గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు పాల్గొన్నారు.
ఎస్టీ హాస్టల్ తనిఖీ
చిన్నశంకరంపేట(మెదక్): మండల కేంద్రంలోని గిరిజన హాస్టల్‌ను శనివారం ఎంపీడీఓ దామోదర్ తనిఖీ చేశారు. ఈ మేరకు వంట గదిలోని బియ్యం, పప్పు దినుసులను పరిశీలించి వార్డెన్ స్వామికి పలు సూచనలు చేశారు.
ఘనంగా జాతీయ ఐక్యతాదినోత్సవం
మెదక్‌జోన్: ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని శనివారం డిగ్రీకళాశాలలో రాష్ట్రీయ ఏక్తా దివస్ (జాతీయ ఐక్యతా దినోత్సవం) ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ ఐక్యతా ప్రతిజ్ఞ చేశారు. దేశ ఐక్యత, సమగ్రత, భద్రతను పరిరక్షించడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన సేవలను స్మరించుకున్నారు. దేశంలోని భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడుతూ.. జాతీయ సమైక్యతా భావనను ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో ఆచరించాలని ప్రతిజ్ఞ చేశారు.
ప్రతి ఇంటికీ ఇంకుడుగుంత
కౌడిపల్లి (నర్సాపూర్): భూగర్భ జలాల పెంపునకు ప్రతి ఇంటి వద్ద ఇంకుడుగుంత నిర్మించుకోవాలని ఎంపీడీఓ శ్రీనివాస్ సూచించారు. శనివారం మండలంలోని కంచన్‌పల్లిలో ఇంకుడుగుంతల నిర్మాణ పనులను ముగ్గు వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వీబీజీ రాంజీ పథకంలోని జలసిరి పనుల ద్వారా వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంపొందించవచ్చన్నారు. కార్యక్రమంలో ఎంపీఓ రామారావు, సర్పంచ్ సత్యంగౌడ్, ఉపసర్పంచ్ లక్ష్మణ్, ఏపీఓ పుణ్యదాస్, కార్యదర్శి నరహరి, గ్రామస్థులు పాల్గొన్నారు.
సొంతింటి కల సాకారమే లక్ష్యం
రేగోడ్ (మెదక్): పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎస్. దిగంబర్‌రావు అన్నారు. శనివారం మండల పరిషత్ కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులకు మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. గుడిసెలు, రేకుల ఇళ్ల స్థానంలో కొత్త ఇళ్ల నిర్మాణానికి 68 మందికి, రీప్లేస్‌మెంట్ కింద మరో 71 మందికి కలిపి మొత్తం 139 మందికి మంజూరు పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో పీసీసీ సభ్యుడు మున్నూరు కిషన్, ఎంపీడీఓ శ్రీనివాస్, డీసీసీ ప్రధాన కార్యదర్శి రాజేందర్ పాటిల్, చోటా మియా, ఎం. నరేందర్ తదితరులు పాల్గొన్నారు.


