చిన్నశంకరంపేట(మెదక్): హైదరాబాద్లోని ఎస్సీఆర్టీలో రెండు రోజులు పాటు రాష్ట్రస్థాయి మాక్ పార్లమెంట్ నిర్వహించారు. ఇందులో మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ విద్యార్థిని ఆర్తి చంద్రిక అత్యున్నత ప్రతిభ చాటి రాష్ట్రస్థాయి ప్రథమ బహుమతికి ఎంపికై ంది. తెలంగాణ రాష్ట్ర విద్యశాఖ అడిషనల్ డైరెక్టర్ మదన్మోహన్ ఆర్తి చంద్రికకు అవార్డును అందజేశారు. మాక్ పార్లమెంట్లో డిప్యూటీ స్పీకర్గా తన ప్రతిభను చాటి రాష్ట్రస్థాయి అవార్డుకు ఎంపికై న విద్యార్థితో పాటు గైడ్ టీచర్ లింగమయ్యను రాష్ట్రస్థాయి అధికారులతో పాటు డీఈఓ రాజు, అకాడమీ మానిటరింగ్ అధికారి సుదర్శనమూర్తి, ప్రిన్సిపాల్ వాణికుమారి అభినందించారు.


