మెదక్‌ను కరువు జిల్లాగా ప్రకటించాలి | - | Sakshi
Sakshi News home page

మెదక్‌ను కరువు జిల్లాగా ప్రకటించాలి

Nov 1 2026 8:13 AM | Updated on Nov 1 2026 8:13 AM

హవేళిఘణాపూర్‌(మెదక్‌): మెదక్‌ జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించి రైతులకు న్యాయం చేయాలని వక్తలు డిమాండ్‌ చేశారు. శనివారం మెదక్‌ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో రాజకీయ నాయకులు, ప్రజాసంఘాల నేతలు మాట్లాడారు. మెదక్‌ జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించకుంటే ఉద్యమం నిర్వహిస్తామని హెచ్చరించారు. మంజీరా జలాలపై పూర్తి హక్కు లేకపోవడంతో ఈ ప్రాంత రైతులకు అన్యాయం జరుగుతుందన్నారు. ప్రభుత్వం వివక్ష వీడి మంజీరరా నీటి పూర్తి హక్కులు రైతులకు కల్పించాలని కోరారు. కార్యక్రమంలో తెలంగాణ రైతు రక్షణ సమితి జిల్లా అధ్యక్షులు మైసయ్యయాదవ్‌, మెదక్‌సిటీజన్స్‌ ఫోరం నాయకులు పీడీ ఆనందం, బాగయ్య, బీసీ సంఘం నేత బాల్‌రాజ్‌గౌడ్‌, టీపీటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట్‌రాంరెడ్డి, ఆయా పార్టీల నేతలు, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.

రౌండ్‌టేబుల్‌ సమావేశంలో వక్తల డిమాండ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement