అభివృద్ధి పనుల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి పనుల పరిశీలన

Nov 1 2026 8:13 AM | Updated on Nov 1 2026 8:13 AM

నిజాంపేట(మెదక్‌): మండల పరిధి నగరం గ్రామంలో చేపడుతున్న పలు అభివృద్ధి పనులను మండల ప్రత్యేక అధికారి దేవ్‌కుమార్‌ శనివారం పర్యవేక్షించారు. ఎంపీడీఓ ముజాహిద్‌తో కలిసి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల మార్కింగ్‌, పనుల పురోగతితో పాటు సీసీ రోడ్డు నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతి వేడుకల్లో హాజరైన వారితో శ్రీఏక్తా దివస్‌శ్రీ (జాతీయ ఐక్యత) ప్రతిజ్ఞ చేయించారు. అలాగే, అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించి పనితీరును తనిఖీ చేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ అంతంపల్లి సుశీల, పంచాయతీ కార్యదర్శి మొహమ్మద్‌ ఆరీఫ్‌ హుస్సేన్‌, ఉప సర్పంచ్‌ నాజం, గ్రామస్తులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement