సమాజంలో గౌరవంగా జీవించాలి | - | Sakshi
Sakshi News home page

సమాజంలో గౌరవంగా జీవించాలి

Nov 1 2026 8:13 AM | Updated on Nov 1 2026 8:13 AM

కౌడిపల్లి (నర్సాపూర్‌): సమాజంలో ప్రతి ఒక్కరూ గౌరవంగా జీవించాలని తహసీల్దార్‌ కృష్ణ అన్నారు. శనివారం మండలంలోని నాగ్సాన్‌పల్లిలో నిర్వహించిన సివిల్‌ రైట్స్‌ డే కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. చట్టం దృష్టిలో అందరూ సమానమేనని, ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా వ్యవహరించాలని సూచించారు. రెండు గ్లాసుల పద్ధతి సరికాదని, ఏవైనా సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని చెప్పారు. కార్యక్రమంలో సర్పంచ్‌ పద్మ, మాజీ సర్పంచ్‌ ఎల్లం, ఉపసర్పంచ్‌ నర్సింలు, లక్ష్మయ్య, శంకర్‌నాయక్‌, భిక్షపతి, పంచాయతీ కార్యదర్శి దుర్గ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement