ఫోన్లకు దూరంగా ఉంటేనే సత్ఫలితాలు | - | Sakshi
Sakshi News home page

ఫోన్లకు దూరంగా ఉంటేనే సత్ఫలితాలు

Oct 30 2026 7:30 AM | Updated on Oct 30 2026 7:30 AM

ఫోన్లకు దూరంగా ఉంటేనే సత్ఫలితాలు ఇంటికో ఇంకుడుగుంత ఉద్యోగాల కల్పనకు కృషి నీటి వృథాను అరికడదాం

అల్లాదుర్గం జడ్జి సుచరిత

అల్లాదుర్గం(మెదక్‌): విద్యార్థులు ఫోన్లు, సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉంటేనే మంచి ఫలితాలు సాధిస్తారని అల్లాదుర్గం జూనియర్‌ సివిల్‌ జడ్జి, మండల్‌ లీగల్‌ సర్వీస్‌ కమిటీ చైర్‌పర్సన్‌ సుచరిత స్పష్టం చేశారు. మండల పరిధిలోని గడిపెద్దాపూర్‌ జెడ్పీ పాఠశాలలో ‘సురక్షిత్‌ బచ్‌పన్‌ అభియాన్‌’లో భాగంగా పోక్సో చట్టంపై గురువారం నిర్వహించిన న్యాయ అవగాహన సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు. తల్లిదండ్రులు విద్యార్థులకు మొబైల్‌ఫోన్లు ఇవ్వవద్దన్నారు. బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం, లైంగిక వేధింపులకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంఈఓ లక్ష్మణ్‌, హెచ్‌ఎం నర్సింహులు, లీగల్‌ సర్వీసెస్‌ సిబ్బంది ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

పెద్దశంకరంపేట(మెదక్‌): ఎల్‌నినో ప్రభావంతో ఎదురయ్యే నీటి ఎద్దడిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అందరూ ఇంటికొక ఇంకుడుగుంత నిర్మించాలని మెదక్‌ జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీపీఓ యాదయ్యలు సూచించారు. పెద్దశంకరంపేట మండల పరిషత్‌ కార్యాలయంలో సర్పంచ్‌లు, అధికారులతో కలసి గురువారం ఎల్‌నినో ప్రభావంపై సమీక్షించారు. ఎల్‌నినో వల్ల గ్రామాల్లో నెలకొంటున్న సమస్యల పరిష్కారానికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలన్నారు. నీటి సమస్యలు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కమలాపూర్‌, కట్టెల వెంకటాపూర్‌, కోళాపల్లి, ఆరేపల్లి తదితర గ్రామాల్లో డీపీఓ యాదయ్య చేయూత పెన్షన్‌ల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల వివరాలను పరిశీలించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి ఎంపీడీఓ షాకీర్‌అలీ, ఎంపీఓ జాకీర్‌హుస్సేన్‌, సర్పంచ్‌లు పాల్గొన్నారు.

జిల్లా ఇన్‌చార్జ్‌ డీడబ్ల్యూఓ హేమభార్గవి

నర్సాపూర్‌: దివ్యాంగులకు పలు సంస్థల సహకారంతో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు తమ వంతు కృషి చేస్తామని జిల్లా ఇన్‌చార్జ్‌ డీడబ్ల్యూఓ హేమభార్గవి స్పష్టం చేశారు. స్థానిక రైతు వేదికలో యూత్‌ ఫర్‌ జాబ్స్‌ ఫౌండేషన్‌, ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో దివ్యాంగులకు గురువారం ఏర్పాటు చేసిన స్క్రీనింగ్‌ క్యాంపులో పాల్గొని మాట్లాడారు. దివ్యాంగులకు అవసరమైన శిక్షణ ఇప్పించి అర్హతలను బట్టి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు స్క్రీనింగ్‌ క్యాంపు ఏర్పాటు చేశామని ఆమె చెప్పారు. కార్యక్రమంలో ఐసీడీఎస్‌ సూపర్‌ వైజర్లు వసుమతి, సరళకుమారి తదితరులు పాల్గొన్నారు.

నర్సాపూర్‌: వాటర్‌ ఫిల్టర్ల నుంచి వచ్చే వృథా నీటిని ఇంకుడు గుంతల్లోకి వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని మున్సిపల్‌ కమిషనర్‌ సాయికుమార్‌ సూచించారు. ఆయన గురువారం పట్టణంలోని పలు వాటర్‌ ఫిల్టర్లను పరిశీలించి సూచనలు చేశారు. పట్టణంలోని ప్రతి వాటర్‌ ఫిల్టర్‌ వాటర్‌ కంపెనీ వద్ద ఇంకుడు గుంత తప్పనిసరిగా నిర్మించుకోవాలని ఆయన సూచించారు. నీటిని ఫిల్టర్‌ చేసే సమయంలో వచ్చె వృథా నీరు మురికి కాలువలోకి వెళ్లకుండా చర్యలు తీసుకుని ఇంకుడు గుంతలోకి వెళ్లే విధంగా చూడాలని చెప్పారు. ఎల్‌నినో పరిస్థితులు ఉన్నందున అందరు నీటిని పొదుపుగా వాడాలని ఆయన సూచించారు. ఆయన వెంట పలువురు మున్సిపల్‌ ఉద్యోగులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement