ఎంపీ రఘునందన్‌రావు
నర్సాపూర్: రాజ్యాంగం ప్రకారమే దేశంలో ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని ఎన్నికల కమిషన్ చేపడుతుందని ఎంపీ రఘునందన్‌రావు తెలిపారు. ఓ ప్రైవేటు కాలేజీ విద్యార్థులతో ఎస్‌ఐఆర్ కార్యక్రమంపై గురువారం ఏర్పాటు చేసిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మనిషికి ఒకటి కన్నా ఎక్కువ ఓట్లు ఉంటే తీసివేయడమే సర్ ఉద్దేశ్యమని, ఓటరు జాబితా నుంచి అర్హుల పేర్లు ఎక్కడా తొలగించలేదని ఆయన వివరించారు. ఎస్‌ఐఆర్‌పై కాంగ్రెస్‌తో ప్రతిపక్షాల నాయకులు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలకు మెరుగైన వైద్యం, విద్య అందించేందుకు తన వంతు కృషి చేస్తున్నానని రఘునందన్‌రావు చెప్పారు. మూడు లక్షల ఎంపీ లాడ్స్ నిధులతో స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో డెంటల్ చైర్, ఇతర పరికరాలు సమకూర్చి వాటిని ప్రారంభించారు. అనంతరం పలువురు రోగులతో మాట్లాడి వైద్యసేవలపై, మందులపై ఆరా తీశారు. ప్రారంభోత్సవంలో డీసీహెచ్‌ఎస్ డాక్టర్ శివదయాల్, ఆస్పత్రి ఇన్‌చార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ వంశీకృష్ణ, ఆర్‌ఎంఓ డాక్టర్ రాజేశ్‌కుమార్‌తోపాటు బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్‌గౌడ్, పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.
స్వీపర్లకు వేతనాలు ఇప్పించాలని వినతి
ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న స్వీపర్లకు వేతనాలు ఇప్పించాలని కోరుతూ రఘునందన్‌రావుకు పీఆర్‌టీయూ టీఎస్ జిల్లా ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు. వారికి జూన్ నెల నుంచి వేతనాలు రావడం లేదని, వేతనాలు అందక వారి కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల పాలవుతున్నాయని వారు ఆవేదనవ్యక్తం చేశారు. వినతిపత్రం అందజేసిన వారిలో జిల్లా యూనియన్ అధ్యక్షుడు కృష్ణ, ప్రధానకార్యదర్శి సామ్యానాయక్, నాయకులు అనిల్‌రెడ్డి, నర్సాగౌడ్, శ్రీకాంత్‌గౌడ్, నరేందర్‌రెడ్డి తదితరులున్నారు.


