జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ రుబీనా ఫాతిమా
మెదక్జోన్: పోక్సో చట్టం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ శ్రీమతి రుబీనా ఫాతిమా తెలిపారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సురక్షిత్ బచ్పన్ అభియాన్ – ఏ పాన్ ఇండియా స్కూల్ అవగాహన కార్యక్రమాన్ని గురువారం పట్టణంలోని సెయింట్ డాన్ బాస్కో ఉన్నత పాఠశాల, తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, జూనియర్ కళాశాల (బాలికల), ప్రభుత్వ ఉన్నత పాఠశాల, మినీ గురుకులం పాఠశాలల్లో అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...ప్రతి ఒక్కరికి పోక్సో గురించి తెలిసి ఉండాలన్నారు. పిల్లలను లైంగిక వేధింపులు, లైంగిక దాడుల నుంచి రక్షించడం ఈ చట్టం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. గుడ్ టచ్–బ్యాడ్ టచ్ గురించి పిల్లలకు చిన్న వయస్సు నుంచే అవగాహన కల్పించాలని, ఎవరైనా అనుచితంగా తాకినా లేదా అసౌకర్యానికి గురిచేసినా వెంటనే పెద్దలకు చెప్పాలని వివరించారు. కార్యక్రమాలలో న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.


