శత శాతం ఉత్తీర్ణతకు కృషి | - | Sakshi
Sakshi News home page

శత శాతం ఉత్తీర్ణతకు కృషి

Oct 30 2026 7:30 AM | Updated on Oct 30 2026 7:30 AM

జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి నీలిమ

శివ్వంపేట(నర్సాపూర్‌): వసతిగృహాల్లో ఉండి చదువుకుంటున్న విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించాలని అందుకు ఉపాధ్యాయులు కూడా కృషి చేయాలని జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి నీలిమ సూచించారు. శివ్వంపేటలోని గిరిజన బాలుర వసతిగృహాన్ని గురువారం ఆమె తనిఖీ చేసి రికార్డులు, హాస్టల్‌ పరిసరాలు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థులకు బూట్లు, కంచాలను పంపిణీ చేశారు. ఈ సందర్భగా ఆమె మాట్లాడుతూ..హాస్టల్స్‌లోని విద్యార్థులకు మౌలిక వసతుల కల్పనతో పాటు వారికి కావాల్సిన దుప్పట్లు, బూట్లు, పుస్తకాలు ఇతర వస్తువులు అందిస్తున్నామన్నారు. విద్యార్థులు శ్రద్ధగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో హాస్టల్‌ వార్డెన్‌ యాదగిరి, ఏఎన్‌ఎం సుజాత, సిబ్బంది ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement