పల్లెకు జలసిరి | - | Sakshi
Sakshi News home page

పల్లెకు జలసిరి

Sep 28 2026 7:21 AM | Updated on Sep 28 2026 7:21 AM

‘వీబీజీరాంజీ’ పథకంతో అనుసంధానం

ఎల్‌నినో ముప్పును అధిగమించేందుకు అధికారులు ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. వీబీ–జీరాంజీ పథకం ద్వారా గ్రామాల్లో భూగర్భజలాల పెంపునకు శ్రీకారం చుట్టారు. ఇందుకోసం ప్రత్యేకంగా 5 రకాల పనులు చేయాలని నిర్ణయించారు. ఉపాధి కూలీలతో జిల్లాలో విరివిగా పనులు చేయిస్తున్నారు. – మెదక్‌జోన్‌

జిల్లాలో ఎల్‌నినో ప్రభావం కొంతమేర తక్కువగా ఉన్నప్పటికీ, భూగర్భజలాలను పెంచి వేసవిలో తాగు, సాగునీటి ఎద్దడి రాకుండా జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది. అందులో భాగంగా పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖల ఆధ్వర్యంలో ‘వీబీజీరాంజీ’ పథకం ద్వారా నీటి సంరక్షణ పనులు చేపడుతున్నారు. జిల్లాలో 1.63 లక్షల జాబ్‌కార్డులుండగా, 3.20 లక్షల మంది కూలీలు ఉన్నారు. గతంలో రోజు కూలీ రూ. 307 ఉండగా, ప్రస్తుతం ఒక్క రూపాయి పెంచి రూ. 308 చేశారు. అలాగే గతంలో ఒక్కో కుటుంబానికి 100 పనిదినాలు కల్పించి వలసల నివారణకు పూర్తిస్థాయిలో అడ్డుకట్ట వేశారు. ఈక్రమంలో నూతనంగా ‘వీబీజీరాంజీ’ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఒక్కో కుటుంబానికి ఏడాదికి 125 రోజులు, జిల్లాకు 44 లక్షల పనిదినాలు కల్పించారు. ఈమేరకు కూలీలకు ఏడాదికి సుమారు రూ.135.52 కోట్ల పనులు కల్పించాల్సి ఉంటుంది. పనిని బట్టి మెటీరియల్‌ వర్క్‌కోసం అందులో 40 శాతం నిధులను జిల్లాకు కేటాయిస్తారు. అంటే సుమారు రూ. 50 కోట్ల వరకు మెటీరియల్‌కు మంజూరు కానుంది.

పల్లెల్లో జోరుగా పనులు

జిల్లావ్యాప్తంగా 492 పంచాయతీలుండగా, ప్రతి గ్రామంలో 80కి తగ్గకుండా సోక్‌పిట్లు తవ్వాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు ఆదేశించారు. ఈ లెక్కన 39,360 సోక్‌పిట్లు తవ్వాల్సి ఉంది. అలాగే ఒక్కో గ్రామంలో రెండు కమ్యూనిటీ సోక్‌పిట్స్‌, రెండేసి ఫామ్‌పాండ్స్‌, రెండేసి బోర్‌వెల్‌ రీఛార్జ్‌ స్ట్రక్చర్స్‌, పెర్కోలేషన్‌ ట్యాంకు (చిన్నచెరువు)లు మంజూరు కాగా, పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం రోజుకు 9 వేల పైచిలుకు మంది కూలీలు పనులు చేస్తున్నారు. ప్రస్తుతం వ్యవసాయ పనులు ఉండటంతో ఈ సంఖ్య కొంత తక్కువగా ఉంది. త్వరలో నాలుగింతలుగా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. భూగర్భజలాలు పెంచే ఈ 5 రకాల పనుల్లోనూ మెటీరియల్‌ కాంపౌండ్‌ పనులు సైతం కొనసాగుతున్నాయి. వీటిలో ఒక్కో సోక్‌పిట్‌కు నాలుగు కూలీలలు పోనూ, మిగితా రెండు రకాల సైజు కంకర, ఇసుక తదితర మెటీరియల్‌ కోసం ఒక్కో దానికి రూ.6,900 చొప్పున ఇస్తున్నారు. కమ్యూనిటీ సోక్‌పిట్‌ కోసం మాత్రం రూ. 13,400 ఇస్తుండగా, బోర్‌వెల్‌ రీఛార్జీ స్ట్రక్చర్‌ కోసం రూ.35 వేల చొప్పున ఇస్తున్నారు. చిన్నపాటి నీటి కుంటలకు రూ.5 లక్షల చొప్పున చెల్లిస్తున్నారు.

ఐదు రకాల పనులకు శ్రీకారం

జిల్లాలో 1.63 లక్షల జాబ్‌కార్డులు

ఈ ఏడాది మొత్తం

44 లక్షల పనిదినాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement