టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు యాదగిరి
కౌడిపల్లి(నర్సాపూర్): పీఆర్‌సీని వెంటనే ప్రకటించాలని టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు యాదగిరి, రాష్ట్ర కౌన్సిలర్ సంగయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం మండలంలోని వివిధ పాఠశాలలో టీపీటీఎఫ్ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఐదు డీఏలు, పీఆర్సీని వెంటనే ప్రకటించాలన్నారు. ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో చేస్తున్న చర్చల్లో ఈ విషయం తేల్చకపోతే టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా టీపీటీఎఫ్ మండల నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా మాధవ్‌చౌదరి, ప్రధాన కార్యదర్శిగా వెంకటేశంచారి, ఉపాధ్యక్షుడిగా కృష్ణమూర్తి, మహిళా ఉపాధ్యక్షురాలిగా లక్ష్మి, కార్యదర్శులుగా రాంసింగ్, స్వాతి, జిల్లా కౌన్సిలర్‌గా గన్య తదితరులు ఎన్నుకున్నారు.


