విద్యారంగాన్ని విస్మరిస్తే ప్రభుత్వం పతనమే | - | Sakshi
Sakshi News home page

విద్యారంగాన్ని విస్మరిస్తే ప్రభుత్వం పతనమే

Sep 23 2026 8:27 AM | Updated on Sep 23 2026 8:27 AM

పాలిటెక్నిక్‌ల విలీన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి

ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు మణికంఠరెడ్డి

మెదక్‌ కలెక్టరేట్‌: విద్యారంగాన్ని విస్మరిస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వానికి పతనం తప్పదని, పాలిటెక్నిక్‌ల విలీన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి డిమాండ్‌ చేశారు. మెదక్‌ పట్టణంలోని టీఎన్‌జీఓ భవన్‌లో మంగళవారం ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా 20వ మహా సభలు ఘనంగా జరిగాయి. ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు ఆశరాజు అధ్యక్షతన జరిగిన ఈ మహాసభలకు ముఖ్యఅతిథిగా మణికంఠరెడ్డి హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో విద్యారంగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు, ఉన్నత విద్య, పాలిటెక్నిక్‌ విద్య, మెదక్‌లో ప్రభుత్వ యూనివర్సిటీ ఏర్పాటుపై సర్కార్‌ నిర్లక్ష్యం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించకపోతే ప్రభుత్వంపై విద్యార్థుల్లో ఆగ్రహం పెరుగుతుందని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా నిర్మాణ బాధ్యులు ఖలీక్‌, ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యదర్శి దినకర్‌, రాష్ట్ర గర్‌ల్స్‌ వింగ్‌ కో–కన్వీనర్‌ కండె విజేత, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మచ్చ రమేశ్‌, జిల్లా ఆఫీస్‌ బేరర్‌ పాపయ్య, జిల్లా నాయకులు తేజ, శివ, సంజన, ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement