రీసర్వే పారదర్శకంగా చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

రీసర్వే పారదర్శకంగా చేపట్టాలి

Sep 23 2026 8:27 AM | Updated on Sep 23 2026 8:27 AM

రీసర్వే పారదర్శకంగా చేపట్టాలి ఏడుపాయల హుండీ ఆదాయం రూ.49.26 లక్షలు ఉద్యోగ, పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలి స్కూల్‌ ఆవరణలోకి ‘కొండ చిలువ’ ఆర్టీసీలో ఔట్‌ సోర్సింగ్‌ డ్రైవర్లకు ఆహ్వానం

ఆర్డీఓ రమాదేవి

హవేళిఘణాపూర్‌(మెదక్‌): భూభారతి రీ సర్వేను పారదర్శకంగా నిర్వహించాలని మెదక్‌ ఆర్డీఓ రమాదేవి అన్నారు. మంగళవారం మెదక్‌ మండలం కోంటూర్‌ గ్రామంలో కొనసాగుతున్న భూభారతి రీ సర్వేను ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సర్వేకు వెళ్లిన బృందం రైతులు, యజమానుల సమక్షంలోనే వివరాలను పరిశీలించి సమస్యలను పరిష్కరించేలా చూడాలన్నారు. ఎలాంటి జాప్యం లేకుండా సమన్వయంతో పని చేసి వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. భూముల హద్దులు, రికార్డుల వివరాలు సక్రమంగా నమోదయ్యేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ లక్ష్మణ్‌బాబు, సర్వే సిబ్బంది పాల్గొన్నారు.

పాపన్నపేట(మెదక్‌): ఏడుపాయల హుండీ ఆదాయం రూ.49,26,228 వచ్చినట్లు ఆలయ ఈవో వీరేశం వెల్లడించారు. 80 రోజుల అనంతరం మంగళవారం స్థానిక గోకుల్‌షెడ్డులో శ్రీ వెంకట అన్నమాచార్య సేవా ట్రస్ట్‌ ఆధ్వర్యంలో హుండీ లెక్కించగా నగదుతోపాటు 0.080 గ్రాముల మిశ్రమ బంగారం, 0.768.గ్రాముల వెండి వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఇండియన్‌ బ్యాంకు సిబ్బందితోపాటు పోలీసులు ఆలయ సిబ్బంది ఉన్నారు.

టీఎన్‌జీఓ మాజీ అధ్యక్షుడు శ్యాంరావు

మెదక్‌జోన్‌: ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని టీఎన్‌జీఓ మాజీ అధ్యక్షుడు శ్యాంరావు డిమాండ్‌ చేశాడు. ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పరిష్కరించాలని, అధికారంలోకి వచ్చి 3 ఏళ్లు కావస్తున్నా నేటికి తత్సారం చేయటం సరైంది కాదన్నారు. ఉద్యోగ జేఏసీ ఎన్నో పర్యాయాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా సమస్యలను పరిష్కరించకపోవడం బాధాకరమన్నారు. చర్చలకు సమయం ఇచ్చి కుంటిసాకులతో కాలయాపన చేస్తుందని మండిపడ్డారు. ప్రభుత్వం ఇదే ధోరణి సాగిస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని హెచ్చరించారు.

హతమార్చిన సిబ్బంది

రామాయంపేట(మెదక్‌): కాళ్లగడ్డ సమీపంలోని బాలికల గురుకుల కళాశాల హాస్టల్‌ ఆవరణలోకి సోమవారం రాత్రి వచ్చిన కొండచిలువను హాస్టల్‌ సిబ్బంది హతమార్చారు. పట్టణ శివారులో ఎత్తయిన గుట్టల మధ్య ఉన్న స్కూల్‌ ఆవరణలోకి తరచూ పాములు వస్తున్నాయని విద్యార్థినుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే చాలా వరకు పాములను హతమార్చడం జరిగిందని సిబ్బంది తెలిపారు. తరచూ వస్తున్న పాములతో విద్యార్థినులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

నారాయణఖేడ్‌: ఆర్టీసీ డిపోలో ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిన డ్రైవర్‌ ఉద్యోగాల నియామకానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఎం సుబ్రహ్మణ్యం మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. అర్హులైన ఔత్సాహికులు పదవతరగతి ఒరిజినల్‌ మెమో, ఆధార్‌, పాన్‌ కార్డులు, కులధ్రువీకరణపత్రం, రెండు పాస్‌ పోర్టు సైజు ఫొటోలు, ఒరిజినల్‌ డ్రైవింగ్‌ లైసెన్సుతోపాటు ఒరిజినల్‌ ధ్రువపత్రాలకు సంబంధించి రెండు సెట్ల జిరాక్స్‌ కాపీలను తీసుకువచ్చి కార్యాలయ పనివేళల్లో డీఎం కార్యాలయంలో సంప్రదించాలన్నారు. మరిన్ని వివరాలకు 9347249242 నంబరులో సంప్రదించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement