స్లాబు వేశారు.. వదిలేశారు | - | Sakshi
Sakshi News home page

స్లాబు వేశారు.. వదిలేశారు

Sep 23 2026 8:27 AM | Updated on Sep 23 2026 8:27 AM

నర్సాపూర్‌: దివ్యాంగుల బాలుర హాస్టలు భవన నిర్మాణం పనులు మధ్యలో నిలిచి దశాబ్దం దాటినా ఎవరూ పట్టించుకోనందున అసంపూర్తి భవనం అలంకారప్రాయంగా మారింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ హయాంలో 2012–13 సంవత్సరంలో మహిళా శిశు అభివృద్ధి శాఖ అధికారులు ఉమ్మడి మెదక్‌ జిల్లా స్థాయి దివ్యాంగుల బాలుర వసతి గృహాన్ని నర్సాపూర్‌లో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అందుకుగాను రూ.కోటి మంజూరు చేసి నిర్మాణ పనులు ప్రారంభించారు. మంజూరైన రూ.కోటి నుంచి సుమారు రూ.86 లక్షలు వెచ్చించి భవనం మొదటి అంతస్తుకు స్లాబ్‌ పనులు పూర్తి చేశారు. కాగా 2014లో రాష్ట్రం విడిపోవడం, అటు తర్వాత రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన అనంతరం స్థానికంగా గెలిచిన ప్రజాప్రతినిధులు, కొత్త ప్రభుత్వంలోని అధికారులు అసంపూర్తి భవనాన్ని పూర్తి చేసే దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కొంత కాలానికి భవనం పూర్తి చేసేందుకు అదనంగా నిధులు కావాలని స్థానిక పంచాయితీరాజ్‌శాఖ అధికారులు సుమారు రూ.70లక్షల ప్రతిపాదనలతో ప్రభుత్వానికి పంపి ఏళ్లు గడుస్తున్నాయి. భవనానికి అదనంగా నిధులను ప్రభుత్వం మంజూరు చేయనందున భవనం అసంపూర్తిదశలోనే నిలిచింది.

భవనం పూర్తి చేయాలి

నర్సాపూర్‌లో తహసీల్దార్‌, ఎకై ్సజ్‌ శాఖలకు సొంత భవనాలు లేక ఐబీ అథితిగృహంలో ఆ రెండు కార్యాలయాలు ఏర్పాటు చేయగా వ్యవసాయ శాఖ ఆఫీసును శిథిలావస్థకు చేరిన భవనంలో కొనసాగిస్తుండగా పలు కార్యాలయాలకు సొంత భవనాలు లేక అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. కాగా అసంపూర్తిగా ఉన్న దివ్యాంగుల హాస్టలు భవనానికి అదనంగా నిధులు కేటాయించి నిర్మాణ పనులు పూర్తి చేసి ఆయా శాఖల కార్యాలయాలకు కేటాయిస్తే బాగుంటుందని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

దశాబ్దం దాటినా మోక్షం లేని ఉమ్మడి జిల్లా దివ్యాంగుల హాస్టలు భవనం,

రూ.86లక్షలు వ్యయం చేసినా నిరుపయోగమే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement