మా భవిష్యత్‌తో ఆటలొద్దు | - | Sakshi
Sakshi News home page

మా భవిష్యత్‌తో ఆటలొద్దు

Sep 23 2026 8:27 AM | Updated on Sep 23 2026 8:27 AM

మెదక్‌ కలెక్టరేట్‌: కొత్త కొత్త స్కీంలు తెచ్చి మా భవిష్యత్‌తో ఆటలాడొద్దని, ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ 97ను వెంటనే రద్దు చేయాలని పాలిటెక్నిక్‌ విద్యార్థులు ప్రభుత్వంపై మండిపడ్డారు. మంగళవారం మెదక్‌ ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్‌ విద్యార్థినులు స్థానిక రాందాస్‌ చౌరస్తాలో ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. అంతకుముందు బతుకమ్మ ఆడి ప్రభుత్వ వైఖరిపై నిరసన తెలిపారు. మా భవిష్యత్‌ను అంధకారంలోకి నెట్టేలా ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ ఉందని వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం స్పందించే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ ఆందోళనకు బీజేపీ, ఏబీవీపీ నాయకులు సంఘీభావం తెలిపి ధర్నాలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement