నర్సరీల నిర్వహణ పేరిట రూ. లక్షలు దుర్వినియోగం
మెదక్‌జోన్: మెతుకుసీమ ఎడ్యుకేషన్ హబ్‌గా మారబోతుంది. అత్యున్నత విద్యాసంస్థలు ఒక్కోటి అందుబాటులోకి వస్తుండటంతో విద్యలో వెనుకబడిన ఈ ప్రాంతానికి మంచి రోజులు రాబోతున్నాయి. డిగ్రీ అనంతరం ఉన్నత చదువుల కోసం హైదరాబాద్ లాంటి నగరాలకు పరుగు పెట్టకుండా ఇక ఉన్నచోటనే ఉన్నత విద్యనభ్యసించే అవకాశం లభించటంతో పేద, మధ్య తరగతి విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పేద విద్యార్థులకు వరం
జిల్లాలో ఒకప్పుడు కేవలం డిగ్రీ వరకు మాత్రమే ఉండగా, ఆపై చదువులకు పట్టణాలకు వెళ్లాల్సిన పరిస్థితి. దీంతో పేద విద్యార్థులు రూ. లక్షలు ఖర్చు చేసి ప్రైవేట్‌లో ఉన్నత చదువులు చదవలేక డిగ్రీతోనే ఆపేవారు. ఈక్రమంలో రెండేళ్ల క్రితం మెడికల్ కాలేజీ మంజూరు కావటంతో ఇప్పటికే వైద్య, నర్సింగ్ విద్య కొనసాగుతోంది. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం రూ. 200 కోట్లు మంజూరు కాగా, రామాయంపేటలో సుమారు 25 ఎకరాల్లో దీని నిర్మాణం సాగుతోంది. ఇప్పటికే 16 జూనియర్ కళాశాలలతో పాటు, 3 డిగ్రీ కళాశాలలు, నర్సాపూర్‌లో పీజీ కాలేజీ నడుస్తుంది. మెదక్ పట్టణంలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్(ఐటీసీ) హవేళిఘణాపూర్ మండల కేంద్రంలో కొనసాగుతుంది. ఇందులో శిక్షణ పొందిన అభ్యర్థులకు బయట కంపెనీలలో ఉద్యోగం గ్యారంటీగా లభిస్తోందని అధికారు లు చెబుతున్నారు. ఎంజేపీ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల ఇప్పటికే కొనసాగుతుండగా, కొత్తగా వాటి సరసన కేంద్రీయ విద్యాలయం మంజూరు కోసం ఉన్నతాధికారుల నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఇందుకోసం అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి అనువైన భవనం లభిస్తే ఈ ఏడాది నుంచే కేంద్రీయ విద్యాలయం జిల్లా ఖాతాలో చేరనుంది.
పేదల సంక్షేమానికి పెద్దపీట
ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్
అవినీతి తేటతెల్లమై ఏడాదైనా చర్యలు శూన్యం
విచారణ పేరిట కాలయాపన
రామాయంపేట బల్దియాలో కరువైన ఆహ్లాదం


