వినాయకుడి ప్రతిమ.. విద్యార్థి ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

వినాయకుడి ప్రతిమ.. విద్యార్థి ప్రతిభ

Sep 22 2026 10:08 AM | Updated on Sep 22 2026 10:08 AM

వినాయకుడి ప్రతిమ.. విద్యార్థి ప్రతిభ

పాపన్నపేట(మెదక్‌): పర్యావరణ హితమే ధ్యేయంగా.. ఓ పదో తరగతి విద్యార్థి రూ పుదిద్దిన ఏడడుగుల వినాయకుడి విగ్రహం పూజలతో పాటు ప్రశంసలు అందుకుంటోంది. మండలంలోని మిన్‌పూర్‌కు చెందిన జంగం పర్వయ్య, కవిత దంపతులకు ఇద్దరు కొడుకులు.. చిన్న కొడుకు దీపక్‌ కుర్తివాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. చిన్నప్పటి నుంచి బొమ్మలు వేయడం, విగ్రహాలు తయారు చేయడంపై ఆసక్తి పెంచుకున్నా డు. దీపక్‌ ఆరో తరగతి చదువుతున్నప్పటీ నుంచి వినాయకులను తయారు చేస్తున్నా డు. మొదట మూడు ఫీట్ల ఎత్తుతో విగ్రహం తయారు చేయగా, ఈ సారి ఎత్తును ఏడు ఫీట్లకు పెంచాడు. ఏటా పండుగకు నెల రోజుల ముందే పనులు ప్రారంభిస్తాడు. అబ్లాపూర్‌ చెరువులో నుంచి మట్టిని తెచ్చి, గడ్డి, పొట్టు, పాత ఇనుప చువ్వలు వాడుతూ ఒక్కడే వినాయకుడి ప్రతిమను తయారు చేస్తాడు. అనంతరం రంగులు వేసి ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతాడు. తన ఇంటి ముందు ప్రతిష్ఠించి తొమ్మిది రోజుల పాటు పూజలు అందుకున్న అనంతరం నిమజ్జనం చేస్తారు. మంచి కళాకారుడిగా ఎదగడమే తన లక్ష్యమని తెలిపారు.

23న ఉద్యోగ మేళా

సంగారెడ్డి టౌన్‌: జిల్లాలోని నిరుద్యోగల కోసం ఈజీఎంఎం ఆధ్వర్యంలో ఈ నెల 23న ఉద్యోగ మేళా నిర్వహిస్తునట్లు జిల్లా గ్రామీణాభివద్ధి సంస్థ సెర్ప్‌ అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 10 గంటలకు పాత డీఆర్డీఏ కార్యాలయంలో ఇంటర్వ్యూలు జరుగుతాయన్నారు. చైన్నె సిల్మస్‌ కంపెనీలో సేల్స్‌, మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌, సెక్యూరిటీ గార్డుల పోస్టులు ఉన్నాయని 18 నుంచి 40 ఏళ్ల వారు అ ర్హులని జీతం రూ.12,500 నుంచి 20,000 వరకు ఉంటుందన్నారు. విద్యార్హత, ఆధార్‌, రేషన్‌ కార్డు జిరాక్స్‌, ఫొటోలతో హాజరుకావాలని నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement