ప్రజావాణికి 90 అర్జీలు | - | Sakshi
Sakshi News home page

ప్రజావాణికి 90 అర్జీలు

Sep 22 2026 10:08 AM | Updated on Sep 22 2026 10:08 AM

ప్రజావాణికి 90 అర్జీలు బాధితులకు సత్వర న్యాయం కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ దొందూ దొందే వాలీబాల్‌ పోటీల్లో విద్యార్థినుల సత్తా

మెదక్‌ కలెక్టరేట్‌: ప్రజావాణి వినతులను త్వరగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్‌ నగేశ్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ప్రజల నుంచి ఆర్జీలు స్వీకరించారు. భూభారతి 36, పెన్షన్లు 10, ఇందిరమ్మ ఇల్లు 10, ఇతర 34 కలిపి మొత్తం 90 అర్జీలు వచ్చాయని తెలిపారు. విన తులను శాఖల వారీగా పరిశీలించి పరిష్కారం చూపించాలన్నారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ అంబాదాస్‌ రాజేశ్వర్‌, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీఆర్డీఓ శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

మెదక్‌జోన్‌: ప్రజావాణిలో వచ్చిన ప్రతి ఫిర్యాదుపై చట్టబద్ధంగా, నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాధితులకు సత్వర న్యాయం అందించాలని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు పోలీస్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వారితో నేరుగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. భూ వివాదాలు, ఆర్థిక మోసాలు, వేధింపులు తదితర అంశాలకు సంబంధించిన ఫిర్యాదులను పరిశీలించి, సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఫిర్యాదుపై సమగ్రంగా విచారణ చేపట్టి, చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

నర్సాపూర్‌: కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ దొందూ దొందేనని బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్‌గౌడ్‌ విమర్శించారు. సోమవారం పట్టణంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశంలో కాంగ్రెస్‌ 60 ఏళ్ల పాటు అధికారంలో ఉండగా ఆ పార్టీ నాయకులు, పదేళ్ల పాలనలో బీఆర్‌ఎస్‌ నాయకులు దొడ్డిదారిలో ఆస్తులు సంపాదించుకున్నారని ఆరోపించారు. ఆ రెండు పార్టీల నాయకులకు ప్రజల సమస్యలు పట్టవన్నారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చించకుండా సమయాన్ని వృథా చేస్తున్నారని మండిపడ్డారు. ఫాంహౌస్‌లలో మొక్కుబడిగా సర్వే చేస్తే సరిపోదని, వాటిలో ప్రభుత్వ భూమి ఉంటే స్వాధీనం చేసుకోవాలన్నారు. భూములను ఆక్రమించిన వారిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. కాగా, నర్సాపూర్‌లో అసంపూర్తిగా ఉన్న డబుల్‌బెడ్రూం ఇళ్లను పూర్తి చేసి పేదలకు పంపిణీ చేయాలని కోరారు. సమావేశంలో నాయకులు సురేశ్‌, ఆంజనేయులుగౌడ్‌, రమేశ్‌గౌడ్‌, నారాయణరెడ్డి, రాజేందర్‌, ప్రేంకుమార్‌, నగేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

అల్లాదుర్గం(మెదక్‌): జిల్లాస్థాయి అండర్‌–14 వాలీబాల్‌ పోటీల్లో అల్లాదుర్గం జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినులు ప్రథమ బహుమతి సాధించారు. అలాగే అండర్‌–16 విభాగంలో ద్వితీయ బహుమతి పొందారు. ఈసందర్భంగా విజేతలను సర్పంచ్‌ సౌమ్య సోమవారం ఘనంగా సన్మానించి అభినందించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం స్వప్న, ఉపాధ్యాయులు సత్యనారాయణ, వార్డు సభ్యులు, మాజీ ఉపసర్పంచ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement