గడువులోగా ‘సర్‌’ పూర్తి చేయాలి | - | Sakshi
Sakshi News home page

గడువులోగా ‘సర్‌’ పూర్తి చేయాలి

Sep 22 2026 10:08 AM | Updated on Sep 22 2026 10:08 AM

కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌

మెదక్‌ కలెక్టరేట్‌: సర్‌ ప్రక్రియకు సంబంధించిన అన్ని లక్ష్యాలను వచ్చే నెల 25లోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్‌ నుంచి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పలువురు అధికారులతో కలిసి పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ.. నిర్దేశించిన లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలని అధికారుకు సూచించారు. ప్రస్తు తం ఫారం 6, 7, 8 దరఖాస్తుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలన్నారు. నోటీసులు జారీ చేయడంతో పాటు వాటిపై తదుపరి చర్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించాన్నారు. ప్రతి బీఎల్‌ఓ పనితీరును నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు. ప్రతి ప్రక్రియను ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహించాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మెదక్‌ ఆర్డీఓ రమాదేవి, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్‌ గఫర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement