కాళోజీ సేవలు చిరస్మరణీయం | - | Sakshi
Sakshi News home page

కాళోజీ సేవలు చిరస్మరణీయం

Sep 10 2026 8:47 AM | Updated on Sep 10 2026 8:47 AM

మెదక్‌ కలెక్టరేట్‌: సామాజిక ఉద్యమకారుడు కా ళోజీ నారాయణరావు సేవలు చిరస్మరణీయమని అదనపు కలెక్టర్‌ నగేశ్‌ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో కాళోజీ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా అదనపు కలెక్టర్‌ మా ట్లాడుతూ.. తెలంగాణ మాండలికంలో సామాజిక రచనలు చేస్తూ ప్రజలను సామాజికంగా మేల్కొల్పిన గొప్ప ప్రజాకవి కాళోజీ నారాయణరావు అని కొనియాడారు. ఆయన సేవలను గుర్తించి ప్రభుత్వం పద్మవిభూషణ్‌ బిరుదుతో గౌరవించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయన పుట్టిన రోజును తెలంగాణ భాషా దినోత్సవంగా ప్రకటించిందన్నారు. భావితరాలకు ఆయన స్ఫూర్తిని అందిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ అంబదాస్‌ రాజేశ్వర్‌, ఎస్సీ సంక్షేమ అధికారి సింధు, బీసీ సంక్షేమ అధికారి ఉపేందర్‌, వివిధ శాఖల జిల్లాస్థాయి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

జిల్లా పోలీస్‌ కార్యాలయంలో..

మెదక్‌జోన్‌: ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకుని జిల్లా పోలీస్‌ కార్యాలయంలో బుధవారం జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పుట్టుక నీది.. చావు నీది.. బతుకంతా దేశానిది అంటూ కాళోజీ తన కవిత్వం ద్వారా ప్రతి ఒక్కరిలో దేశభక్తి, సామాజిక బాధ్యతను పెంపొందించారని అన్నారు. ప్రజల సమస్యలను నిర్భయంగా తన రచనల్లో ప్రతిబింబిస్తూ ప్రజాకవిగా ప్రత్యేక గుర్తింపు పొందారని తెలిపారు. తెలంగాణ ప్రజల హక్కులు, సామాజిక న్యాయం కోసం కాళోజీ చేసిన కృషి చిరస్మరణీయమన్నారు. కార్యక్రమంలో సైబర్‌ క్రైం డీఎస్పీ సుభాష్‌ చంద్రబోస్‌, సీఐలు జార్జ్‌, సందీప్‌ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

అదనపు కలెక్టర్‌ నగేశ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement