త్రుటిలో తప్పిన ప్రమాదం | - | Sakshi
Sakshi News home page

త్రుటిలో తప్పిన ప్రమాదం

Sep 10 2026 8:47 AM | Updated on Sep 10 2026 8:47 AM

ఎల్‌సీ రిటర్న్‌ ఇవ్వకముందే ఆన్‌

ప్రాణాలతో బయటపడిన రైతు

పాపన్నపేట(మెదక్‌): విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ ఆపరేటర్‌ నిర్వాకంతో మృత్యువు అంచుల వరకు వెళ్లిన ఓ రైతు.. సమయస్ఫూర్తితో వ్యవహరించి త్రుటిలో ప్రాణపాయం నుంచి బయపడిన సంఘటన మండలంలోని రుగ్యా తండాలో బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. రాజ్యాతండా పరిధిలోని రుగ్యా తండాలోని ట్రాన్స్‌ఫార్మర్‌ వద్ద బోర్‌ మోటార్‌కు వెళ్లే వైరు తెగిపోయింది. దీంతో సంబంధిత గిరిజన రైతు రవి నార్సింగి లైన్‌మెన్‌ బాబుకు ఫోన్‌ చేసి ఎల్‌సీ అడిగాడు. వెంటనే ఎల్‌సీ ఇచ్చిన బాబు, పని చేసుకోమని పురమాయించాడు. వెంటనే ట్రాన్స్‌ఫార్మర్‌పైకి ఎక్కిన రవి, రెండు నట్లు విప్పి, మూడో నట్టు విప్పుతుండగా కరెంట్‌ వచ్చింది. అయితే ఆ సమయంలో నట్టు పూర్తిగా ముట్టుకోకపోవడంతో కొంచెం హమ్మింగ్‌ వచ్చింది. కాళ్లకు చెప్పులు ఉండటంతో పాటు కరెంట్‌ పనులపై కొంచెం అవగాహన ఉండటంతో కింద ఉన్న వారికి విషయం తెలిపాడు. వెంటనే రైతులు లైన్‌మెన్‌కు విషయం తెలపడంతో విద్యుత్‌ సరఫరాను నిలిపి వేయించాడు. దీంతో తృటిలో రవి ప్రాణాలతో బయటపడ్డాడు. ఇదే విషయమై డీఈ రామేశ్వర్‌స్వామి వివరణ కోరగా.. సాధారణంగా ఒకేసారి రెండు ఫీడర్లకు ఎల్‌సీ ఇవ్వొద్దు, కానీ విద్యుత్‌ సిబ్బంది పొరపాటున ఇచ్చారని తెలిపారు. అవగాహన లోపంతో బాచారం ఫీడర్‌ రిటర్న్‌ ఇవ్వాల్సి ఉండగా, నార్సింగి ఫీడర్‌ ఇచ్చాడన్నారు. అందువల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని, బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement