జిల్లా పశువైద్యాధికారి ఆదిత్యవర్మ
పాపన్నపేట(మెదక్): మూగ జీవాలకు సత్వర వైద్య సేవలు అందించాలని జిల్లా పశువైద్యాధికారి ఆదిత్యవర్మ సిబ్బందికి సూచించారు. బుధవారం మండల కేంద్రంలోని పశువైద్య కేంద్రాన్ని సందర్శించి రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాలానుగుణంగా పశువులకు టీకాలు ఇవ్వాలని ఆదేశించారు. పశువైద్య శిబిరాల నిర్వహణ, కృత్రిమ గర్భధారణ కార్యక్రమం చేపట్టి వెంటనే ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు పశువులకు సకాలంలో అందేలా చూడాలని అన్నారు. వైద్యాధికారులు, సిబ్బంది సమన్వయంతో పని చేయాలన్నారు. కార్యక్రమంలో మండల పశువైద్యాధికారులు డాక్టర్ సౌమ్యరెడ్డి, ప్రవీణ్ కుమార్, జూనియర్ వెటర్నరీ ఆఫీసర్ సతీశ్ కుమార్, శివాజీ, ఎల్‌ఎస్‌ఏ సురేష్, రాకేష్, సిబ్బంది గోపాల మిత్రలు పాల్గొన్నారు.
కొమురవెల్లి రైల్వేస్టేషన్‌లో అదనపు ప్లాట్‌ఫాం
రూ. 40 కోట్లతో నిర్మాణం
కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి మల్లన్న రైల్వేస్టేషన్‌లో రూ. 40 కోట్లతో అదనపు ప్లాట్ ఫాం నిర్మించనున్నట్లు దక్షిణమధ్య రైల్వే అధి కారి పద్మజ వెల్లడించారు. బుధవారం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకు లు, అఽధికారులు స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం మరో రెండు రైళ్లను పెంచాలని వినతిపత్రం అందించారు. ఆమె మాట్లాడుతూ మనోహరాబాద్ నుంచి కొత్తపల్లి వరకు చేపడుతున్న రైల్వే లైన్ పనులు పూర్తయితే టెంపుల్ కారిడార్ ఏర్పాటు అవుతుందన్నారు. 24 గంటలూ భక్తులకు రైల్వే సిబ్బంది స్టేషన్‌లో అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేశామన్నారు.
మల్బరీ సాగుతో సిరులు
రాష్ట్ర పట్టు పరిశ్రమశాఖ జేడీ లత
తొగుట(దుబ్బాక): మల్బరీ సాగు చేసిన రైతుల ఇంట సిరుల పంట పండుతుందని రాష్ట్ర పట్టు పరిశ్రమ శాఖ జాయింట్ డైరెక్టర్ లత అన్నారు. మండలంలోని పెద్దమాసాన్‌పల్లి రైతు వేదికలో ‘నాపట్టు.. నా అభిమానం’ కార్యక్రమంలో భాగంగా బుధవారం అవగాహ న సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా జేడీ హాజరై మాట్లాడారు. పట్టుగూళ్లకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉందన్నారు. మల్బరీ సాగు చేసిన రైతులకు ప్రభుత్వం అన్నివిధాల ప్రోత్సాహం అందిస్తుందన్నారు. ఎల్‌ని నో ప్రభావంతో వర్షాలు కురిసే పరిస్థితి లేనందన రైతులు సాగుకు ముందురావాలన్నారు. మిగితా పంటల మాదిరిగా పంట పెట్టుబడి ఖర్చులు అంతగా ఉండవన్నారు. మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పంటలు సాగుచేసే దిశగా రైతులు ఆలోచించాలని ఆమె కోరారు. అనంతరం శాస్త్రవేత్తలు మల్లికార్జున్, రాఘవేంద్ర మల్బరీ సాగుపై రైతులకు ఆవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా నోడల్ ఆఫీసర్ తిరుపతిరెడ్డి, జిల్లా అధికారి సామల ఐలయ్య, వివిధ మండలాల రైతులు పాల్గొన్నారు.
కల్హేర్(నారాయణఖేడ్): నిజాంపేట్ మండల కేంద్రం సమీపంలో సంగారెడ్డి–నాందేడ్ 161 జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి పాములు కలకలం రేపాయి. వాహనదారులు భయభ్రాంతులకు గురయ్యారు. రహదారిపైకి కొండచిలువ, ఇతర పాములు వస్తున్నాయని వాహనదారులు తెలిపారు.
మెదక్‌జోన్: ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడిగా సీహెచ్ అక్షయ్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం రాత్రి రాష్ట్ర అధ్యక్షుడు యా దవల్లి వెంకటస్వామి, ఎన్‌ఎస్‌యూఐ జాతీ య అధ్యక్షుడు వినోద్‌లు ఒక ప్రకటన విడుదల చేశారు. విద్యార్థుల సమస్యలపై పోరాటం చేయటం ఎన్‌ఎస్‌యూఐ ప్రధాన కర్తవ్యమని అక్షయ్ గౌడ్ అన్నారు. ఫీజులు, స్కాలర్‌ిషిప్‌లు, హాస్టళ్లు, పరీక్షలు, తదితర అంశాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారిస్తామని తెలిపారు.


