మన అంగన్‌వాడీ.. మన బాధ్యత | - | Sakshi
Sakshi News home page

మన అంగన్‌వాడీ.. మన బాధ్యత

Sep 10 2026 8:41 AM | Updated on Sep 10 2026 8:41 AM

మెదక్‌ కలెక్టరేట్‌: జిల్లాలో సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణ్‌ అభియాన్‌ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేస్తామని జిల్లా కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ స్పష్టం చేశారు. బుధవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జాతీయ 9వ పోషణ మాసం పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మన అంగన్‌వాడీ– మన బాధ్యత అనే నినాదంతో సెప్టెంబరు 9 నుంచి అక్టోబర్‌ 8 వరకు పోషణ మాసంలో భాగంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. మాతా, శిశు సంరక్షణకు ప్రాధాన్యమిస్తూ ప్రభుత్వాలు పథకాలను అమలు చేస్తున్నాయన్నారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి హేమ భార్గవి, డీఈఓ రాజు, సంబంధిత అధికారులు ఉన్నారు. అనంతరం ఫౌండేషనల్‌ లిటరసీ అండ్‌ న్యూమరసీ (ఎఫ్‌ఎల్‌ఎన్‌) కార్యక్రమాల అమలు తీరుపై కలెక్టరేట్‌లో డీఈఓ, ఎంఈఓలు, సెంట్రల్‌ స్క్వేర్‌ ఫౌండేషన్‌ ప్రతినిధులతో కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. విద్యార్థుల్లో ప్రాథమికంగా చదవడం, రాయడం, గణిత నైపుణ్యాలను మెరుగుపర్చాలని సూచించారు. కరా టేలో రాష్ట్రస్థాయిలో బంగారు పతకం, 4 ఛాంపియన్‌షిప్‌లు సాధించిన నిత్యశ్రీని అభినందించారు. అంతకుముందు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణి ప్రసాద్‌ హైదరాబాద్‌ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement