రాష్ట్ర స్థాయి అవార్డు అందుకున్న శివకుమార్‌ | - | Sakshi
Sakshi News home page

రాష్ట్ర స్థాయి అవార్డు అందుకున్న శివకుమార్‌

Sep 6 2026 8:25 AM | Updated on Sep 6 2026 8:25 AM

రాష్ట్ర స్థాయి అవార్డు అందుకున్న శివకుమార్‌ యూరియా కోసం భారీ లైన్‌

కౌడిపల్లి(నర్సాపూర్‌): మండల కేంద్రమైన కౌడిపల్లిలోని ఎస్టీగురుకుల పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న జీవశాస్త్రం ఉపాధ్యాయుడు శివకుమార్‌ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపికయ్యారు. దీంతో శనివారం కొండగల్‌లో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవంలో సీఎం రేవంత్‌రెడ్డి, ఎస్టీ గురుకులాల సంస్థ రాష్ట్ర కార్యదర్శి సీతాలక్ష్మి చేతులమీదుగా అవార్డు అందుకున్నారు. శివకుమార్‌ గత రెండేళ్లుగా ఎస్టీ గురుకులంలో జీవశాస్త్రం బోధిస్తూ అంకితభావంతో విధులు నిర్వహించడంతోనే ఉత్తమ అవార్డు వచ్చిందని ప్రిన్సిపాల్‌ ఫణికుమార్‌ తెలిపారు. ఈ సందర్భంగా శివకుమార్‌ను ప్రిన్సిపాల్‌, ఉపాధ్యాయులు అభినందించారు.

చిన్నశంకరంపేట(మెదక్‌): చిన్నశంకరంపేట మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు భారీగా వరుసలు దీరారు. ఆన్‌లైన్‌లో యూరియా బుక్‌ చేసుకున్న రైతులు పీఏసీఎస్‌ వద్దకు ఉదయమే చేరుకుని యూరియా కొనుగోలు చేసేందుకు లైన్‌ కట్టారు. తాము ఆన్‌లైన్‌ యాప్‌లో యూరియా బుక్‌ చేసుకున్నప్పటికీ గంటల కొద్దీ లైన్‌లో నిలిచోవడం మాత్రం తప్పడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు యూరియాను నేరుగా అందించేందుకు చర్యలు చేపట్టాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement