అర్ధరాత్రి ఏఎస్పీ ఆకస్మిక తనిఖీ | - | Sakshi
Sakshi News home page

అర్ధరాత్రి ఏఎస్పీ ఆకస్మిక తనిఖీ

Sep 5 2026 7:19 AM | Updated on Sep 5 2026 7:19 AM

మెదక్‌జోన్‌: రాత్రి వేళల్లో పోలీసు సిబ్బంది నిర్వహిస్తున్న పెట్రోలింగ్‌, బ్లూకోడ్స్‌, బీట్‌ డ్యూటీలను అదనపు ఎస్పీ విక్రాంత్‌ కుమార్‌ సింగ్‌ గురువారం అర్ధరాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పట్టణంలోని ప్రధాన ప్రాంతాల్లో పర్యటించి విధుల్లో ఉన్న సిబ్బంది పనితీరును పరిశీలించారు. పెట్రోలింగ్‌ను ముమ్మరం చేయాలని, అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల కదలికలపై నిఘా ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు. వాహన తనిఖీలు, డ్రంకెన్‌ డ్రైవ్‌ క్రమం తప్పకుండా నిర్వహించాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. దొంగతనాలు, ఇతర ప్రాపర్టీ నేరాలు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement