మండలస్థాయి టీచర్లతో విశ్లేషణ
బోధనకు ఇబ్బందులేర్పడతాయి
ఐదు రోజుల పాటు టీచర్లు మూల్యాంకన కేంద్రాల్లో ఉండటంతో బోధనకు ఆటంకం కలుగుతుంది. ఇప్పటికే ప్యానల్ టీంలలో సుమారు 20 మంది టీచర్లు బడి విడిచి వెళ్లారు. విద్యార్థులు ఎలాగైనా పాస్ కావాలనే ఉద్దేఽశ్యంతో సొంత పాఠశాలల్లో కాపీయింగ్ పెరిగే అవకాశం ఉంటుంది. కనుక ఇది ఆమోద యోగ్యం కాదు. –పంతుల రాజు, పీఆర్టీయూ,మండల శాఖ అధ్యక్షుడు
మూల్యాంకనంలో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించేందుకు ఎక్స్‌టర్నల్ విధానాన్ని ప్రవేశపెడుతూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి 1 నుంచి 9వ తరగతి చదివే విద్యార్థుల ఎస్‌ఏ–1,ఎస్‌ఏ–2తో పాటు పదో తరగతి ఎస్‌ఏ–1కు ఇది వర్తించనుంది. మూల్యాంకనం చేసే టీచర్లకు పారితోషికం ఇచ్చే విధంగా నిధులు విడుదల చేయనున్నారు. కాగా ఉపాధ్యాయ వర్గాలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
–పాపన్నపేట(మెదక్)
ప్రభుత్వ పాఠశాలల్లో సాధారణంగా నాలుగు ఫార్మేటివ్, రెండు సమ్మేటివ్ పరీక్షలు నిర్వహిస్తుంటారు. వీటిని సంబంధిత పాఠశాలకు చెందిన సబ్జెక్ట్ టీచర్లే మూల్యాంకనం చేస్తుంటారు. అయితే అనుత్తీర్ణతకు తామే బాధ్యత వహించాల్సి ఉంటుందన్న ఆలోచనతో టీచర్లు విద్యార్థులందరినీ పాస్ చేస్తుంటారని తెలుస్తోంది. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న పాఠశాలల్లో సరిగా మూల్యాంకనం చేయకుండానే మార్కులు వేస్తుంటారనే ఆరోపణలున్నాయి. ఇంకొన్ని పాఠశాలల్లో విద్యార్థులతోనే మూల్యాంకనం చేయిస్తారనే విమర్శలున్నాయి.
మండల వనరుల కేంద్రాల్లో మూల్యాంకనం
ఇక నుంచి ఎస్‌ఏ–1,ఎస్‌ఏ–2 పరీక్షలకు సంబంధించి బాహ్య పాఠశాలల టీచర్ల ద్వారా మూల్యాంకనం చేయిస్తారు. ఇంటర్నెట్, కంప్యూటర్లు, సీసీ కెమెరాలు తదితర సౌకర్యాలున్న మండల వనరుల కేంద్రం లాంటి సౌకర్యాలున్న చోట మూల్యాంకన కేంద్రం ఏర్పాటు చేస్తారు. పరీక్ష కాగానే వెంటనే జవాబు పత్రాలను సీల్డ్ కవర్లలో ప్యాక్ చేసి కేంద్రానికి పంపాలి. ఏ టీచర్‌కు సొంత పాఠశాల జవాబు పత్రాలు ఇవ్వకూడదు. ప్రాథమిక పాఠశాల, ప్రాథమికోన్న పాఠశాల, ఉన్నత పాఠశాల కొకరు చొప్పున ఎవాల్యుయేషన్ ఇన్‌చార్జిలను నియమించాలి. 1 నుంచి 5 తరగతుల వరకు పేపర్‌కు రూ.2 చొప్పున, 6 నుంచి 10 వరకు రూ.3 చొప్పున ఎన్యూమరేషన్ చెల్లిస్తారు. 3 నుంచి 5 రోజుల్లో జవాబు పత్రాలను మూల్యాంకనం చేసి అదేరోజు ఆన్‌లైన్‌లో మార్కులు నమోదు చేయాలి.
మండల వనరుల కేంద్రం
మూల్యాంకనానికి పారితోషికం
1 నుంచి 9 తరగతి వరకు అమలు
ఇది సరికాదంటున్న ఉపాధ్యాయ సంఘాలు


