ఎమ్మెల్యే పి.సంజీవరెడ్డి
కల్హేర్(నారాయణఖేడ్): ప్రజల సమస్యలు తీర్చేందుకు అధికారులు బాధ్యతగా పనిచేయాలని ఎమ్మెల్యే పి.సంజీవరెడ్డి సూచించారు. కల్హేర్‌లో మంగళవారం నిర్వహించిన మండల పరిషత్ సమావేశానికి ఆయన హాజరై మాట్ల్లాడారు. సంక్షేమ పథకాలు అర్హులకు అందించేందుకు ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. ప్రతీ నెల ప్రభుత్వ పాఠశాలల్లో జరిగే సమావేశానికి తల్లిదండ్రులు హాజరుకావాలని, ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ చూపాలని కోరారు. నీటి సరఫరా, వివిధ సమస్యలను సర్పంచ్‌లు అధికారుల దృష్టికి తెచ్చారు. లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్‌కార్డులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ వినోద్‌పాటీల్, మండల ప్రత్యేకాధికారి అనిల్‌కుమార్, ఎంపీడీఓ హరినందన్‌రావు, ఎంఈఓ సురేశ్ పాల్గొన్నారు.


